ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసు దర్యాప్తు సక్రమంగా జరగట్లేదని ..దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో మాజీ ఎంపీ హర్హకుమార్ పిల్ దాఖలు చేశారు. పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కిరణ్ కుమార్ వాహనంలో నుంచి దూకటంతో మృతి చెందాడని చెపుతున్నారని.. పోలీసులు కేసు దర్యాప్తు సక్రమంగా చేయట్లేదని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను కూడా సమర్పిస్తామని న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.
పోలీసులు కేసును సక్రమంగానే దర్యాప్తు చేస్తున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. పోలీసుల దర్యాప్తునకు సంతృప్తి చెందిన మృతుని తల్లిదండ్రులు తమ పిటిషన్‌ను గతంలో వెనక్కు తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ కేసులో పోలీసుల దర్యాప్త ప్రొసీజర్‌లో లోపాలున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ..తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది
సీబీఐకి ఇవ్వడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని 2 వారాలకు వాయిదా వేశారన్నారు. శిరోముండనం ఘటనలోనూ సీబీఐ విచారణ కోరుతున్నామని హర్షకుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. కోర్టులు న్యాయం చేస్తాయన్న ఆత్మసంతృప్తి తమకు ఉందన్నారు.
ఇదీ చదవండి: