19 ఏళ్లుగా తెరాసతో ఉన్న బంధాన్ని తెంచుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్... శాసనసభ్యుడి పదవికీ రేపు రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. శనివారం రోజున గన్‌పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత సభాపతి పోచారం శ్రీనివాస్‌ను కలిసి రాజీనామా లేఖ అందించనున్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఈటల.. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని... బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్.... ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు.
సంబంధిత కథనం :
Eatala resign : తెరాస సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా