ETV Bharat / city

ఇళ్లల్లోకి అడవి పిల్లులు.. భయాందోళనలో ప్రజలు - forest cats images

అడవిలో ఉండాల్సిన పిల్లులు దారితప్పి ఇళ్లలోకి వచ్చాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలోని ఓ ఇంట్లోకి అడవి పిల్లులు దూరి... భయబ్రాంతులకు గురిచేశాయి. అటవీ సిబ్బంది వాటిని బంధించి మళ్లీ అడవిలో వదిలిపెట్టారు.

cats
ఇళ్లల్లోకి అడవి పిల్లులు.. భయపడ్డ జనాలు
author img

By

Published : Feb 27, 2021, 4:37 PM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో అడవి పిల్లులు హల్​చల్ చేశాయి. సారపాక పేపర్ బోర్డు ఈస్ట్ గేట్ఏరియాలో ఉన్న కొనకంచి శ్రీనివాసరావు ఇంట్లోకి ఆకస్మాత్తుగా 2 వింత ఆకారంలో ఉన్న జంతువులు దూరాయి. వాటిని చూసిన శ్రీనివాస్​ కుటుంబసభ్యులు అడవి పందులు అనుకొని భయాందోళనకు గురయ్యారు.

అటవీ సిబ్బందికి సమాచారం అందించగా... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వాటిని అడవి పిల్లులుగా గుర్తించారు. స్థానికుల సాయంతో వలలో బంధించారు. వాటిని సురక్షితంగా తీసుకెళ్లి మళ్లీ అడవిలోనే విడిచిపెట్టినట్లు అటవీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆంక్షలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.