Foreign Education Scheme: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక సాయానికి ఉద్దేశించిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్థిక సాయాన్ని పొందిన విద్యార్థులు.. ఏదైనా కారణంతో కోర్సును మధ్యలో ఆపేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము మొత్తం తిరిగి కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. దీనికి కట్టుబడి ఉంటానని సదరు విద్యార్థి 100 రూపాయల స్టాంపు పేపరు మీద రాసి ఇవ్వాలి. వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల లోపు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. స్థానిక సచివాలయంలో తీసుకున్న ఆదాయ పత్రాన్ని కలెక్టరు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులు ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇలాంటి పథకాల్లో ఇప్పటికే లబ్ధి పొందలేదని ధ్రువీకరణ ఇవ్వాలి. ఇప్పటికే విదేశాల్లో చదువుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ...విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులు అభ్యసించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. 100లోపు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తే 100 శాతం ఫీజును, 100 నుంచి 200 వరకు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు వస్తే 50 లక్షలు లేదా...50 శాతం ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి 200 ర్యాంకుల్లో నిలిచిన వర్సిటీల్లో ర్యాంకు సాధించిన వారికే దీన్ని వర్తింపచేయనుంది.
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఎస్సీ విద్యార్థులకు 500 వరకు ర్యాంకులు పొందిన విశ్వవిద్యాలయాల్లో అవకాశం కల్పిస్తోంది. కానీ........ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 200 ర్యాంకుల్లోని విశ్వవిద్యాలయాల వరకే పరిమితం చేసింది. ఈ విధానంతో........... ఎంతో మంది విద్యార్థులు విదేశీ విద్యకు దూరంకానున్నారు.
కేంద్రం 500 ర్యాంకుల వరకు అనుమతి: కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఎస్సీ విద్యార్థులకు 500 వరకు ర్యాంకులు పొందిన విశ్వవిద్యాలయాల్లో అవకాశం కల్పిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 200 ర్యాంకుల్లోని విశ్వవిద్యాలయాల వరకే పరిమితం చేసింది.
ఇవీ చదవండి: