ETV Bharat / city

Fine To karachi bakery: ట్విట్టర్​లో ఫిర్యాదు.. కరాచీ బేకరీకి రూ.10 వేల ఫైన్​ - food and safety imposed fine to karachi bakery

హైదరాబాద్​ కరాచీ బేకరికి అధికారులు 10 వేల రూపాయల జరిమానా విధించారు. ఖాజాగూడ కరాచీ బేకరీలో కొనుగోలు చేసిన మిఠాయి చెడిపోయిందని.. ట్విట్టర్​లో పురపాలకశాఖకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో బేకరీలో తనిఖీలు చేసిన సర్కిల్‌ సహాయ వైద్యాధికారి, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు చర్యలు తీసుకున్నారు.

Fine To karachi bakery
Fine To karachi bakery
author img

By

Published : Jan 2, 2022, 1:56 PM IST

మిఠాయిలపై బూజు ఉందంటూ శనివారం ట్విటర్‌లో అందిన ఫిర్యాదుపై తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ స్పందించారు. హైదరాబాద్​ ఖాజాగూడ కరాచీ బేకరీలో కొనుగోలు చేసిన మిఠాయి చెడిపోయిందని ఓ పౌరుడి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సర్కిల్‌ సహాయ వైద్యాధికారి కె.ఎస్‌.రవి, ఆహార కల్తీ నియంత్రణ అధికారి సూర్య.. వెంటనే బేకరీకి వెళ్లి తనిఖీలు చేశారు. బేకరి పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాల కలబోత, ప్లాస్టిక్‌ వినియోగం, మురుగు నీటి వ్యవస్థ సవ్యంగా లేకపోవడం, కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడాన్ని నిర్ధారించి.. యాజమాన్యానికి రూ.10వేల జరిమానా విధించారు. మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించామని, ఫలితం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

ఇదీచూడండి: Bus Ticket Rate: పండగ ప్రయాణానికి ఛార్జీల మోత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.