ETV Bharat / city

కృష్ణమ్మ కదిలింది.. గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం

author img

By

Published : Jul 13, 2022, 9:38 AM IST

అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులెత్తింది. ఆలమట్టి నుంచి లక్ష క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరిలోనూ భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.

floods
గోదావరి ప్రవాహం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులెత్తింది. ఆలమట్టి నుంచి లక్ష క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరిలోనూ భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం కొంత తగ్గుముఖం పట్టినా ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ నుంచి 8.6 లక్షల క్యూసెక్కులను దిగువకు వదలగా, దుమ్ముగూడెం వద్ద 51.90 అడుగుల మట్టంతో 13.66 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ఉంది. ఎగువన శ్రీరామసాగర్‌ నుంచి ఎల్లంపల్లి వరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నిండటానికి 300 టీఎంసీలు అవసరం కాగా, ఆలమట్టి, తుంగభద్ర నుంచి నీరొస్తుండడంతో శ్రీశైలం పరిస్థితి ఆశాజనకంగా మారింది. ఆలమట్టిలో పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా, 91.48 టీఎంసీల నిల్వ ఉంది. మంగళవారం ఉదయం లక్ష క్యూసెక్కులు ఆలమట్టిలోకి రాగా.. 57 వేల క్యూసెక్కులు నారాయణపూర్‌లోకి వదిలారు. మధ్యాహ్నానికి లక్ష క్యూసెక్కులు విడుదల చేశారు.

నారాయణపూర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా ఉండటంతో వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు క్రమేపీ ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం విద్యుదుత్పత్తి ద్వారా 39 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతోపాటు 82 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 30 వేల క్యూసెక్కులు కాగా క్రమంగా పెరగనుంది. శ్రీశైలం నిండటానికి 165 టీఎంసీలు అవసరం. గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరామసాగర్‌లో 26 గేట్లు ఎత్తి 1.07 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. దిగువన కడెం, ఎల్లంపల్లికి భారీ ప్రవాహం ఉంది. ఎల్లంపల్లి నుంచి 58 గేట్లు ఎత్తి సుమారు నాలుగు లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. దీంతో సుందిళ్ల, అన్నారం నుంచి నీటి విడుదల పెరిగే అవకాశం ఉంది. ఇటు గోదావరి, అటు ప్రాణహిత నుంచి వచ్చే వరదతో మేడిగడ్డ నుంచి నీటి విడుదల పది లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది.భారీ వర్షాలతో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. నల్లవాగు, పోచారం, స్వర్ణ, సుద్దవాగు, ఒట్టివాగు, ఎన్టీఆర్‌ సాగర్‌, పీపీరావు ప్రాజెక్టు, కుమురం భీం, పెద్దవాగు జగన్నాథపూర్‌, నీల్వాయి, రాలివాగు, బొగ్గులవాగు, గుండ్లవాగు, పాలెంవాగు, తలిపేరు, కిన్నెరసాని, మూసీ, వైరా, ఎల్టీ బయ్యారం తదితర ప్రాజెక్టులన్నీ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.