ETV Bharat / city

Polavaram: పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు: తెలంగాణ మంత్రి - పోలవరంపై మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

Puvvada on Polavaram: పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు భద్రాచలంలో వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు. భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ వివరించారు.

TG Minister
పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు
author img

By

Published : Jul 19, 2022, 1:33 PM IST

Puvvada on Polavaram: పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం వద్ద 45 అడుగుల వరద ఉంటుందని చెప్పారు. భద్రాచలం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ తెలిపారు.

భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు పువ్వాడ వెల్లడించారు. ముంపు వల్ల 840 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 220 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు.

"ముంపు ప్రజల కోసం ముఖ్యమంత్రి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు. దాదాపు 72 అడుగుల గోదావరి ప్రవాహం, 25లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. పోలవరం ఎత్తు తగ్గించాలని మేము చాలా సార్లు డిమాండ్ చేశాం. భద్రాచలం కరకట్ట ఎత్తు మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అడ్ర భూభాగం నుంచి గోదావరి నీళ్లు ఎక్కువగా గ్రామాల్లోకి వస్తున్నాయి. కరకట్ట నిర్మాణం కోసం నిపుణుల బృందం పంపి- త్వరలోనే నిర్మాణం చేపడతాం అని సీఎం అన్నారు. వరదల వల్ల 8 సబ్ స్టేషన్లకు ఇబ్బంది కలిగితే అన్నింటిని పునరుద్ధరించాం. 240 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాం." - పువ్వాడ అజయ్, రాష్ట్ర మంత్రి

పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరూ తిరిగి ఇళ్లలోకి వెళ్తున్నారని పువ్వాడ అజయ్ తెలిపారు. వరదల వల్ల 25వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ఇంతటి భారీ వర్షాలకు ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. వరదల వల్ల 8 వేల కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు. వరదల వల్ల ప్రభావితమైన కుటుంబాల ఖాతాల్లోకి రేపటి నుంచి పరిహారం జమ చేస్తామని పువ్వాడ పేర్కొన్నారు.

పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.