తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బీడీఎల్ భానూర్ గ్రామ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో బ్యాంకులోని సామగ్రి కాలిపోయింది.
ఇదీ చదవండి: పురుగుల మందును సిరంజితో ఎక్కించుకుని.. ఆత్మహత్యాయత్నం!