ETV Bharat / city

Gandhi Hospital : గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. సూపరింటెండెంట్​కు మంత్రి కీలక ఆదేశం - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం(Fire Accident at Gandhi Hospital) చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ బోర్డ్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

Fire Accident at Gandhi Hospital
గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
author img

By

Published : Oct 20, 2021, 11:35 AM IST

తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం(Fire Accident at Gandhi Hospital) చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ బోర్డ్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందారు. ఈ ఘటనతో ఆస్పత్రిలోని 5వ అంతస్తు వరకు పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి సిబ్బంది... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్టలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు పరిశీలించి... రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ఎలాంటి హాని జరగలేదు..

ఎలక్ట్రికల్ బోర్డ్​లో కేబుల్స్ దగ్ధమైనట్లు(Fire Accident at Gandhi Hospital) అగ్నిమాపక శాఖ అధికారి నాగేంద్ర తెలిపారు. అగ్ని ప్రమాదం సమయంలో రోగులకు ఇబ్బంది తలెత్తకుండా బయటకు పంపించామని, ఎవరికి ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. గాంధీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైనందున భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశామని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు.

తలసాని ఆరా

ఈ ఘటనపై(Fire Accident at Gandhi Hospital) తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో మాట్లాడి... అగ్నిప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు. హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి: TDP Nirasana : తెదేపా నిరసన గళం.. పోలీసు అరెస్టుల పర్వం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.