ETV Bharat / city

సౌకర్యాల పేరుతో మోసం.. వడ్డీతో సహా కట్టాలని ఆదేశం - అమరావతి వార్తలు

సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న సభ్యుడికి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించని ఓ కంట్రీ క్లబ్‌పై.. తెలంగాణలోని జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. అతను కట్టిన డబ్బుతో పాటు 18శాతం వడ్డీ జమ చేస్తు అదనంగా రూ.15 వేలు చెల్లించాలని ఆదేశించింది.

COUNTRY CLUB
COUNTRY CLUB
author img

By

Published : Sep 6, 2021, 3:46 PM IST

సభ్యత్వం తీసుకుంటే ఫిట్‌నెస్‌ సెంటర్లు, స్విమ్మింగ్‌ ఫూల్‌, హాలిడే ట్రావెల్‌ ప్యాకేజీలు తదితర సేవలు అందుకునే అవకాశం ఉంటుందని నమ్మబలికారు కంట్రీక్లబ్‌ ప్రతినిధులు.. వారి ఒత్తిడి మేరకు హైదరాబాద్ లోని ఉప్పల్‌కు చెందిన వై.వెంకట శ్రీనివాసరెడ్డి సభ్యత్వం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.56 వేలు చెల్లించారు.

ఫిట్‌నెస్‌ సెంటర్‌ హబ్సిగూడలో ఉందని చెప్పడంతో చూడటానికి వెళ్లిన శ్రీనివాస్‌ అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. పూర్తిగా పాడయిపోయి శిథిలావస్థలో ఉండటంతో తన సభ్యత్వాన్ని రద్దు చేసి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మెయిల్‌ ద్వారా కంట్రీక్లబ్​ వారిని అడిగారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి లేఖ ద్వారా అభ్యర్థించారు.

కొన్నాళ్లకు విడతలవారీగా 90 రోజుల్లోగా డబ్బు తిరిగిస్తామని చెప్పిన ప్రతినిధులు ఆ హామీని మరచిపోయారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్‌-3, సాక్ష్యాధారాలు పరిశీలించి నిబంధనల ప్రకారం రూ.52,200, 18శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు పరిహారంగా రూ.10వేలు, కేసు ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

cm jagan: రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్దిపై సీఎం జగన్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.