ETV Bharat / city

సవరణలతో... కేంద్రానికే పవర్! - Financial burdens on states with electricity legislation bill

విద్యుత్‌ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ విడుదల చేసిన ముసాయిదా బిల్లును యథాతథంగా ఆమోదిస్తే ..తెలుగు రాష్ట్రాల పై తీవ్ర ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Financial burdens on states with electricity legislation bill
విద్యుత్‌ చట్టసవరణ బిల్లుతో రాష్ట్రాలపై ఆర్థికభారం
author img

By

Published : May 10, 2020, 7:54 AM IST

విద్యుత్‌ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ విడుదల చేసిన ముసాయిదా బిల్లును యథాతథంగా ఆమోదిస్తే రాష్ట్రాలపై ఎనలేని ఆర్థికభారం పడటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రానికి వదులుకోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థల అధ్యయనంలో తేలింది. ఈ బిల్లుపై వచ్చే నెల 5లోగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలను తెలపాలని కోరుతూ కేంద్రం గడువు పెట్టింది.

ఈ నేపథ్యంలో బిల్లుపై అధ్యయనం చేసిన తెలంగాణ సంస్థలు అందులో అనేక అంశాలు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేల్చాయి. ఆ వివరాలను తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా నివేదిక అందజేశాయి. దీనిని ‘ఈనాడు’ సేకరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రభావం ఒకే రకంగా పడుతుందని నివేదిక పేర్కొంది. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 25 లక్షలు, ఏపీలో 17.72 లక్షలుండటంతో తెలుగురాష్ట్రాలపై పడే ఆర్థిక భారం మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

బిల్లులో కీలక అంశాలు, వాటితో రాష్ట్రాలపై పడే ప్రభావం తీరు..

ముసాయిదాలో ఏముంది?

రాష్ట్ర సగటు సరఫరా వ్యయం (ఏసీఎస్‌)కన్నా తక్కువకు ఎవరికైనా కరెంటు సరఫరా చేస్తే తగ్గించిన మేరకు సొమ్మును నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ (డీబీటీ) చేయాలి. అంటే వినియోగదారుడు పూర్తి సొమ్ము ముందు కట్టాలి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్లపై డీబీటీ విధానం ఉంది. దీన్నే కరెంటు వినియోగదారులకు వర్తింపజేయాలని ముసాయిదాలో ప్రతిపాదించారు.

రాష్ట్రాలపై ప్రభావం!

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోటీ 51 లక్షల లోటెన్షన్‌ (ఎల్‌టీ) గృహ విద్యుత్‌ వినియోగదారులున్నారు. వీరిలో 200 యూనిట్లలోపు నెలకు కరెంటు వాడే కుటుంబాలే కోటీ 35 లక్షలు. వీరందరికీ యూనిట్‌ కరెంటును రూ.3.60కే ఇస్తున్నారు. మొత్తం వినియోగదారుల్లో వీరి శాతం 89 పైనేఉంది. ఉదాహరణకు ఏపీలో నెలకు 50 యూనిట్లలోపు కరెంటు వాడే కుటుంబాల కనెక్షన్లు 54 లక్షలున్నాయి. వీరికి యూనిట్‌ కరెంటును కేవలం రూ.1.45కే ఇస్తున్నారు. అంటే 50 యూనిట్లు కరెంటు కాల్చినవారు ప్రస్తుతం రూ.1.45 చొప్పున కేవలం రూ.72.50 మాత్రమే బిల్లు కడుతున్నారు. కానీ ఏసీఎస్‌ ప్రకారం రాష్ట్రంలో అన్ని వర్గాలకు కలిపి యూనిట్‌ కరెంటు ఏసీఎస్‌ రూ.7.09 అవుతోంది. దీనిప్రకారం కొత్త చట్టం అమల్లోకి వస్తే 50 యూనిట్లు కాల్చిన వారు మొత్తం రూ.350 బిల్లు కట్టాలి. వారి తరఫున రాయితీ భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.277.50ను ప్రస్తుతం విద్యుత్‌ సంస్థలకు వీలున్నప్పుడు ఇస్తోంది. కానీ కొత్త చట్టంతో వారు రూ.350 కట్టిన తరవాత వారి బ్యాంకు ఖాతాకు రాష్ట్రం రూ.277.50 రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలి. ఇలా ఎవరికి ఏ రాయితీ ఇచ్చినా డీబీటీలోనే పంపాలి. వినియోగదారులు మాత్రం కరెంటు బిల్లు ఏసీఎస్‌ ప్రకారం పూర్తిగా కట్టాల్సిందే.

ఇకనుంచి ఏసీఎస్‌ ప్రకారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) పూర్తి కరెంటు ఛార్జీలను ప్రకటించాలి. రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా ఇచ్చుకోవాలి.

ప్రస్తుతం ఏటా కరెంటు ఛార్జీలు, ప్రభుత్వం భరించాల్సిన రాయితీలను ఈఆర్‌సీ ప్రకటిస్తోంది. ఏసీఎస్‌ ప్రకారం రాష్ట్రంలో ఛార్జీలు వసూలు చేయాలంటే ఏపీలోని మొత్తం 17.72 లక్షల వ్యవసాయ బోరు కనెక్షన్లన్నింటికీ వెంటనే మీటర్లు పెట్టాలి. ఈ మీటర్ల ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు రూ.266 కోట్లు ఖర్చుపెట్టాలి. నెలనెలా రీడింగ్‌ తీశాక రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలి. ఆ తరవాత రాయితీ సొమ్మును వారి ఖాతాలకు బదిలీ చేయాలి. ఇది రాష్ట్రంపై అదనపు ఆర్థికభారం. పైగా కొందరు వినియోగదారులు బిల్లు సకాలంలో కట్టడం లేదు. ఇప్పుడు వారు కట్టకున్నా రాయితీని మాత్రం ప్రభుత్వం ఇస్తోంది. కొత్త చట్టంతో వారు బిల్లు కట్టకపోతే విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆదాయం పడిపోతుంది. ప్రభుత్వం నుంచి రాయితీ నిధులు కూడా రావు.

ప్రస్తుతం రాష్ట్ర, ప్రాంతీయ లోడు డిస్పాచ్‌ కేంద్రాల నుంచి రాష్ట్రాలకు కరెంటు సరఫరా, నియంత్రణ జరుగుతోంది. కానీ ఇకనుంచి జాతీయ లోడు డిస్పాచ్‌ కేంద్రం నుంచే అంతా నియంత్రిస్తారు.

జాతీయ కేంద్రం నుంచి నియంత్రిస్తే జాతీయస్థాయిలో తక్కువ ధరకు ఇచ్చే విద్యుత్కేంద్రాల నుంచి డిస్కంలకు కరెంటు సరఫరాకు తొలి ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల జాతీయ విద్కుత్కేంద్రాలు తక్కువ ధరకు ఇస్తున్నందున వాటి నుంచే ఎక్కువ కరెంటు సరఫరా అవుతుంది. రాష్ట్ర థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించి వేయాల్సిందిగా జాతీయ కేంద్రం ఆదేశిస్తుంది. అప్పుడు రాష్ట్ర జెన్‌కోకు నష్టం వస్తుంది.

ప్రాంతాలవారీగా కరెంటు పంపిణీకి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి డిస్కం వారికి ఉప లైసెన్సులివ్వాలి. ప్రజలకు కరెంటు పంపిణీ, బిల్లుల వసూలంతా ఈ కాంట్రాక్టర్లే చూసుకుంటారు. ప్రస్తుతం ఈ పనులు చేస్తున్న డిస్కం తప్పుకోవాలి.

కాంట్రాక్టర్లు ప్రజల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ లేదా ఇతర ఛార్జీలంటూ అదనంగా వసూలుచేసి వాటికి సరిగా లెక్కలు చెప్పకపోతే డిస్కంలను ప్రజలు ప్రశ్నిస్తారు. అప్పుడు రాష్ట్ర డిస్కంలు ఇబ్బందుల్లో పడతాయి.

ప్రస్తుతం రాష్ట్ర ఈఆర్‌సీ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఇకనుంచి రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జి అధ్యక్షతన గల జాతీయ కమిటీ అన్ని రాష్ట్రాల ఈఆర్‌సీల పాలకమండళ్లను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులూ సభ్యులుగా ఉంటారు.

ఈఆర్‌సీ పాలకమండలి నియామకం అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది.

జాతీయస్థాయిలో ‘విద్యుత్‌ కాంట్రాక్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మండలి’(ఈసీఈఏ)ని ఏర్పాటుచేస్తారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) అమలు, కరెంటు కొనుగోలు, అమ్మకాలన్నింటినీ ఈ మండలి పర్యవేక్షిస్తుంది.

ప్రస్తుతం పీపీఏల అమలు, కరెంటు కొనుగోలు, అమ్మకాల వ్యవహారాలపై నిర్ణయాధికారాలన్నీ రాష్ట్ర ఈఆర్‌సీకే ఉన్నాయి. ఈసీఈఏ ఏర్పాటైతే ఇక ఈఆర్‌సీ పాత్ర నామమాత్రమవుతుంది.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదించకుండా అడ్డుకుని తీరతామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.

ఇవీ చదవండి..రాష్ట్రంలో లాక్‌డౌన్ నుంచి మరికొన్ని వెసులుబాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.