ఈ నెల 15న వైఎస్ఆర్ వాహనమిత్ర కింద మూడో ఏడాది ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆటోలు, టాక్సీలు, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు పేర్ని నాని వివరించారు. వాహనాల మరమ్మతులు, ఫిట్‌నెస్, బీమా పత్రాల కోసం ఆర్థిక సాయం చేస్తున్నట్టు వెల్లడించారు.
కరోనా దృష్ట్యా డ్రైవర్లకు నెల ముందే ఆర్థిక సాయం చేస్తున్నాం. కొత్తగా వాహనాలు కొన్నవారు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆటో కొన్నవారు ఈ నెల 8లోగా దరఖాస్తు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాహనమిత్ర అర్హుల జాబితా ప్రదర్శిస్తాం. అనర్హుల తొలగింపు వల్ల గతేడాది కంటే లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. జాబితాలో పేరుంటే ఆటో, టాక్సీతో ఫొటో దిగి అప్‌లోడ్ చేయాలి. అర్హత ఉన్న అందరికీ వాహనమిత్ర కింద ఆర్థిక సాయం అందిస్తాం-పేర్ని నాని
ఇదీ చదవండీ... Jagananna house: రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్