Employment Bank Committee: రాష్ట్ర ప్రభుత్వ ఎంపానెల్డ్ బ్యాంకులుగా డీబీఎస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర బ్యాంకులను గుర్తించేందుకు ఆర్ధికశాఖ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పన్నుల వసూళ్లు, పెన్షన్ల పంపిణీతో పాటుగా.. తదితర ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణ కోసం.. రెండు బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది.
స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆర్ధికశాఖ కార్యదర్శి కెవీవీ సత్యనారాయణ, సభ్యులుగా ఎస్బీఐ, యూబీఐ బ్యాంకుల ఏజీఎంలను ఆర్ధిక శాఖ నియమించింది. బ్యాంకుల ఎంపానెలింగ్ కోసం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా తనను తానే నియమించుకుంటూ ఆర్ధిక శాఖ కార్యదర్శి కె.వి.వి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి: