ETV Bharat / city

Father and Son Suicide Attempt: కలెక్టరేట్‌లో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం - ఏపీ తాజా వార్తలు

Father and Son Suicide Attempt: కలెక్టరేట్‌లో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వట్లేదని ఆవేదన చెంది.. తీవ్ర మనస్థాపంతో వారిద్దరూ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.

Father and Son Suicide Attempt
Father and Son Suicide Attempt
author img

By

Published : Dec 13, 2021, 6:27 PM IST

Father and Son Suicide Attempt: తెలంగాణలోని భువనగిరి కలెక్టరేట్‌లో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. కలెక్టర్ ఛాంబర్​ ముందు పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం ఎనిమిది ఎకరాల భూమిని రూ. 6000లకు కొనుగోలు చేశారు. దానిలో నాలుగు ఎకరాలకు పట్టాదారు పుస్తకం కోసం అప్లై చేయగా ఇప్పటికీ మంజూరు కాలేదు.

కలెక్టరేట్​ చుట్టూ తిరిగిన పట్టాదారు పుస్తకం మాత్రం రాలేదు. దీంతో విసుగు చెందిన ఉప్పలయ్య ఈరోజు ఉదయం కుమారుడు మహేశ్​ను తీసుకుని భువనగిరి కలెక్టరేట్​ వద్దకు చేరాడు. తమ భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ.. ఇద్దరు పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు వారిని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

KIDNAP CASE CHASED IN NELLORE : కిడ్నాప్ కేసు ఛేదన...పోలీసులు అదుపులో నిందితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.