ETV Bharat / city

సమరావతి@ ఉద్యమపథంలో 400వ రోజు

అమరావతి ఉద్యమ నినాదం రాజధాని గ్రామాల్లో మార్మోగింది. రైతుల పోరాటం 400 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని గ్రామాల్లో అమరావతి సంకల్ప ర్యాలీని నిర్వహించారు. అన్ని రాజకీయ పక్షాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపాయి. ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు.

amaravathi agitation
farmers rally in amaravathi
author img

By

Published : Jan 20, 2021, 5:35 PM IST

Updated : Jan 21, 2021, 7:31 AM IST

అమరావతి రైతులు కదం తొక్కారు. చేయిచేయి కలిపి వజ్రసంకల్పాన్ని ప్రదర్శించారు. ఉక్కు పిడికిలి బిగించి జై అమరావతి అని నినదించారు. రాజధాని ఉద్యమసత్తాను చూపించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరిన సందర్భంగా రాజధాని గ్రామాల్లో బుధవారం రైతులు, మహిళలు ‘అమరావతి సంకల్పం’ పేరుతో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది వాహనాలతో ఉదయం 10కి ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 4.30 వరకు 45 కిలోమీటర్ల మేర కొనసాగింది. తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బహుజన పరిరక్షణ సమితి, దళిత ఐకాస, ముస్లిం మైనార్టీ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

అమరావతి సంకల్ప ర్యాలీ... మార్మోగిన ఉద్యమ నినాదం
తుళ్లూరులో పాదయాత్రర్యాలీ ప్రారంభానికి ముందు తుళ్లూరులో రైతులతో కలిసి వివిధ పార్టీల నేతలు పాదయాత్ర చేశారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌, గుంటూరు తెదేపా పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జనసేన నేత పోతిన మహేశ్‌, భాజపా నేత శ్యాంకిశోర్‌, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి బాబూరావు, కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ గ్రామంలో తిరిగారు. దీక్షాశిబిరం వద్ద ఐకాస జెండాను ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో తుళ్లూరు గ్రామశివారు వరకు పాదయాత్రగా నడిచిన తర్వాత ఎంపీ జయదేవ్‌ ట్రాక్టర్‌ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపారు. అదే ట్రాక్టర్‌లో రామకృష్ణ, శ్రావణ్‌కుమార్‌, అనురాధ కూర్చున్నారు. సీడ్‌ యాక్సెస్‌ జంక్షన్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు
రాయపూడి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రహదారి మీదుగా లింగాయపాలెం వెళుతున్న ర్యాలీని జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లింగాయపాలెం వెళ్లడానికి అనుమతి లేదంటూ బారికేడ్లు అడ్డుగా పెట్టారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు అనుమతివ్వడంతో ర్యాలీ కొనసాగింది. లింగాయపాలెం దాటిన తర్వాత మూడు రాజధానుల శిబిరం వైపు వెళ్లకుండా రహదారిపై బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. రైతులు అటుగా వెళ్లకుండా మందడం చేరుకుని ర్యాలీ ముగించారు. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణాజిల్లాల రైతులూ ర్యాలీలో పాల్గొన్నారు.అసత్య ప్రచారాలు మానుకోవాలిరాజధాని అమరావతిపై వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస నాయకులు హితవు పలికారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస కన్వీనర్‌ పి.మల్లికార్జునరావు, మహిళా ఐకాస కన్వీనర్‌ శైలజ, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెదేపా, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, అమరావతి బహుజన ఐకాస తదితర సంఘాల నేతలు డిమాండు చేశారు.పార్లమెంటు వేదికగా పోరాటంపార్లమెంటు సమావేశాల్లో అమరావతికి మద్దతుగా గళమెత్తుతాం. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది. మూడు రాజధానులు ఆర్థికంగా పెనుభారం. ఇది భావితరాలకు ఎంతో నష్టం. రైతులు కన్నీళ్లు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నాళ్లయినా పోరాటాన్ని కొనసాగిస్తాం.

- గల్లా జయదేవ్‌, తెదేపా ఎంపీ

సీఎంకు జ్ఞానోదయం కాలేదు
అమరావతి రైతులు 400 రోజులుగా ఉద్యమిస్తున్నా సీఎం జగన్‌కు జ్ఞానోదయం కావడం లేదు. ఆయన మనసు మార్చుకుని మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.

- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

3 రాజధానులను ఉపసంహరించుకోవాలి
హైకోర్టు తీర్పుతోనైనా జగన్‌కు కనువిప్పు కలగాలి. వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలను అందించాలి. ప్రభుత్వం ఇకనైనా పాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

- తులసిరెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

విద్వేషాలు రెచ్చగొట్టేందుకే
రాజకీయ లబ్ధి కోసం ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ముక్కలు చేయాలని చేస్తే వైకాపా కనుమరుగవడం ఖాయం.

-పోతిన మహేశ్‌, జనసేన అధికార ప్రతినిధి

ఇదీ చదవండి: ప్రేమ..పెళ్లి.. హత్య.. ఆత్మహత్య...

అమరావతి రైతులు కదం తొక్కారు. చేయిచేయి కలిపి వజ్రసంకల్పాన్ని ప్రదర్శించారు. ఉక్కు పిడికిలి బిగించి జై అమరావతి అని నినదించారు. రాజధాని ఉద్యమసత్తాను చూపించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరిన సందర్భంగా రాజధాని గ్రామాల్లో బుధవారం రైతులు, మహిళలు ‘అమరావతి సంకల్పం’ పేరుతో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది వాహనాలతో ఉదయం 10కి ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 4.30 వరకు 45 కిలోమీటర్ల మేర కొనసాగింది. తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బహుజన పరిరక్షణ సమితి, దళిత ఐకాస, ముస్లిం మైనార్టీ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

అమరావతి సంకల్ప ర్యాలీ... మార్మోగిన ఉద్యమ నినాదం
తుళ్లూరులో పాదయాత్రర్యాలీ ప్రారంభానికి ముందు తుళ్లూరులో రైతులతో కలిసి వివిధ పార్టీల నేతలు పాదయాత్ర చేశారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌, గుంటూరు తెదేపా పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జనసేన నేత పోతిన మహేశ్‌, భాజపా నేత శ్యాంకిశోర్‌, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి బాబూరావు, కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ గ్రామంలో తిరిగారు. దీక్షాశిబిరం వద్ద ఐకాస జెండాను ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో తుళ్లూరు గ్రామశివారు వరకు పాదయాత్రగా నడిచిన తర్వాత ఎంపీ జయదేవ్‌ ట్రాక్టర్‌ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపారు. అదే ట్రాక్టర్‌లో రామకృష్ణ, శ్రావణ్‌కుమార్‌, అనురాధ కూర్చున్నారు. సీడ్‌ యాక్సెస్‌ జంక్షన్‌ వద్ద అడ్డుకున్న పోలీసులురాయపూడి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రహదారి మీదుగా లింగాయపాలెం వెళుతున్న ర్యాలీని జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లింగాయపాలెం వెళ్లడానికి అనుమతి లేదంటూ బారికేడ్లు అడ్డుగా పెట్టారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు అనుమతివ్వడంతో ర్యాలీ కొనసాగింది. లింగాయపాలెం దాటిన తర్వాత మూడు రాజధానుల శిబిరం వైపు వెళ్లకుండా రహదారిపై బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. రైతులు అటుగా వెళ్లకుండా మందడం చేరుకుని ర్యాలీ ముగించారు. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణాజిల్లాల రైతులూ ర్యాలీలో పాల్గొన్నారు.అసత్య ప్రచారాలు మానుకోవాలిరాజధాని అమరావతిపై వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస నాయకులు హితవు పలికారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస కన్వీనర్‌ పి.మల్లికార్జునరావు, మహిళా ఐకాస కన్వీనర్‌ శైలజ, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెదేపా, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, అమరావతి బహుజన ఐకాస తదితర సంఘాల నేతలు డిమాండు చేశారు.పార్లమెంటు వేదికగా పోరాటంపార్లమెంటు సమావేశాల్లో అమరావతికి మద్దతుగా గళమెత్తుతాం. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది. మూడు రాజధానులు ఆర్థికంగా పెనుభారం. ఇది భావితరాలకు ఎంతో నష్టం. రైతులు కన్నీళ్లు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నాళ్లయినా పోరాటాన్ని కొనసాగిస్తాం.

- గల్లా జయదేవ్‌, తెదేపా ఎంపీ

సీఎంకు జ్ఞానోదయం కాలేదు
అమరావతి రైతులు 400 రోజులుగా ఉద్యమిస్తున్నా సీఎం జగన్‌కు జ్ఞానోదయం కావడం లేదు. ఆయన మనసు మార్చుకుని మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.

- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

3 రాజధానులను ఉపసంహరించుకోవాలి
హైకోర్టు తీర్పుతోనైనా జగన్‌కు కనువిప్పు కలగాలి. వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలను అందించాలి. ప్రభుత్వం ఇకనైనా పాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

- తులసిరెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

విద్వేషాలు రెచ్చగొట్టేందుకే
రాజకీయ లబ్ధి కోసం ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ముక్కలు చేయాలని చేస్తే వైకాపా కనుమరుగవడం ఖాయం.

-పోతిన మహేశ్‌, జనసేన అధికార ప్రతినిధి

ఇదీ చదవండి: ప్రేమ..పెళ్లి.. హత్య.. ఆత్మహత్య...

Last Updated : Jan 21, 2021, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.