.
53వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు
53వ రోజూ రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్షలో రైతులు కూర్చున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐనవోలు, నవులూరు, ఇతర గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వెలగపూడిలో ఇద్దరు యువకుల 151 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. తుళ్లూరులో తాటాకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
farmers protest in amaravathi for capital
.