అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ… రైతులు 262వ రోజు దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, ఐనవోలు, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, పెదపరిమి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లో రైతులు దీక్షలో పాల్గొన్నారు. అబ్బరాజుపాలెంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
ఉద్దండరాయునిపాలెంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతుల దీక్షకు మద్దతు పలికారు. తామంత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఐనవోలులో రైతులు ఏర్పాటు చేసిన దీక్షను ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అమరావతిని తరలించడం సాధ్యం కాదని నేతలు తేల్చిచెప్పారు.