Farmers suffering urea shortage: రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రాత్రి సమయంలోనూ పడిగాపులు కాస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆధార్ కార్డులు ఇచ్చి గంటల తరబడి వేచి చూసినా ఫలితం లేదని తూర్పు గోదావరి జిల్లా ఊడిముడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి ఎరువులు వేయకపోతే పైరు దెబ్బతిని సరైన దిగుబడి రాదని ఆందోళన వ్యక్తం చేశారు.
urea shortage: మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రైతులు వాపోతున్నారు. అరకొరగా వచ్చిన యూరియా అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. యూరియా కోసం రైతులతో కలిసి తెదేపా ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి: గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం... ముగ్గురు విద్యార్థులు మృతి