ETV Bharat / city

'అవాంతరాలు వచ్చినా.. ముందుకే సాగాను'

పౌరుల హక్కులు కాపాడాల్సిన వారే విద్వేష పూరిత వాతావరణం సృష్టించడంతో అనేక ఇబ్బందులు ఎదురైనా.. న్యాయం కోసం ఆత్మస్థైర్యంతో పనిచేశానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి అన్నారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న సీజే.. జస్టిస్ సత్యనారాయణమూర్తి న్యాయవ్యవస్థలోఒక దిగ్గజమంటూ కొనియాడారు. ఏపీ హైకోర్టు సచిన్ టెండూల్కర్‌గా అభివర్ణించారు.

HC Judge Justice M. Satyanarayana farewell

author img

By

Published : Jun 14, 2022, 5:12 AM IST

Farewell to Justice M. Satyanarayana Murthy: హైకోర్టు అమరావతికి తరలివచ్చాక 16 నెలలు సంతోషంగా విధులు నిర్వహించానని.. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) వాదనలతో న్యాయ విషయాల్లో తాను అనేక కోణాలు తెలుసుకున్నానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఇందుకు అవకాశం కల్పించిన ఏజీ తన పదవీవిరమణ కార్యక్రమానికి హాజరుకాకపోయినా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. పౌరుల హక్కులు కాపాడాల్సినవారే తమ వ్యవహార శైలి, విద్వేషపూరిత చర్యలతో ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చారన్నారు. న్యాయం చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లానని చెప్పారు. తాను ఏ విషయాన్నీ మనసులోకి తీసుకోలేదనీ.. కానీ తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బాధపడ్డారన్నారు. అయినప్పటికీ బాధ్యతల నిర్వహణలో వెనకడుగు వేయలేదన్నారు. వృత్తి జీవితంలో తనకు సహకరించిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి పదవీ విరమణ సందర్భంగా సోమవారం హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

జస్టిస్‌ సత్యనారాయణమూర్తి దంపతులకు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం

సీజే మాట్లాడుతూ.. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి న్యాయవ్యవస్థలో ఒక దిగ్గజం అంటూ ఆయన సేవలను కొనియాడారు. ఏపీ హైకోర్టులో ఆయన 31,202 కేసులు పరిష్కరించారన్నారు. 132 కీలక తీర్పులు ఇచ్చారన్నారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తిని ఏపీ హైకోర్టు సచిన్‌ టెండూల్కర్‌గా అభివర్ణించారు. రాజ్యాంగ, సివిల్‌, క్రిమినల్‌, ట్యాక్స్‌, మధ్యవర్తిత్వం తదితర కేసులను పరిష్కరించిన ఆల్‌రౌండర్‌, మంచితనానికి రోల్‌మోడల్‌, నిజాయతీకి హాల్‌మార్క్‌ అని ప్రశంసించారు. పదవీ విరమణ తర్వాత జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) జ్యుడిషియల్‌ సభ్యులుగానూ తనదైన గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జానకిరామిరెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి కష్టించి పనిచేసేవారన్నారు. ఆయన పదవీ విరమణ న్యాయసమాజానికి తీరని లోటు అన్నారు. బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు మాట్లాడుతూ.. ఎన్నో కీలక తీర్పులిచ్చారని, న్యాయవాదులకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పులు న్యాయవృత్తిని చేపట్టబోయే భావితరాలకు ఉపయోగకరమని సహాయ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ చెప్పారు.

కోర్టు న్యాయవాదుల సన్మానం: పదవీ విరమణ చేసిన జస్టిస్‌ సత్యనారాయణమూర్తి.. ఆయన సతీమణి, హైకోర్టు రిజిస్ట్రార్‌ (విచారణ) ఎంవి.రమణకుమారిలను హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమానికి సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి పదవీ విరమణ సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.