ETV Bharat / city

కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.. బతుకు భారమైంది!

కటిక పేదరికం... రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. అలాంటి కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చి పడింది. కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి... బతుకు భారంగా మారింది. తన కిడ్నీ భర్తకి సరిపోతుందని వైద్యులు చెప్పడం వల్ల ఇచ్చేందుకు భార్య సిద్ధమైంది. వైద్య ఖర్చులు తలకు మించి భారంగా మారడం వల్ల... సాయం కోసం దీనంగా ఎదురు చూస్తోంది ఆ కుటుంబం.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
author img

By

Published : Dec 3, 2019, 8:57 PM IST

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్... ఆటో డ్రైవర్​గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఏడేళ్ల క్రితం ఉస్మాన్ రెండు కిడ్నీలు పాడయ్యాయి. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంపాదన లేకపోగా... అప్పులు చేసి, మిత్రులు, బంధువుల సాయంతో ఏడేళ్లు నెట్టుకొచ్చారు.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

సాయం కోసం...

రెండు నెలల క్రితం ఉస్మాన్ పరిస్థితి విషమంగా మారడం వల్ల నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. కిడ్నీలు మార్చాల్సిందేనని డాక్టర్లు తేల్చి చెప్పారు. భార్య కిడ్నీ ఉస్మాన్​కు సరిపోతుందని చెప్పారు. మూత్రపిండాలు మార్చడానికి 8 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో ... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది ఉస్మాన్​ కుటుంబం. దయగల ప్రభువులు ఎవరైనా తమను ఆదుకుంటారని ఈ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.

ఇవీ చూడండి: దయచేసి.. అతడికి బెయిల్ మంజూరు చేయోద్దు

Intro:TG_HYD_PARGI_14_02_AADUKONDI_PLEASE_AB_PKG_TS10019

యాంకర్:కటిక పేదరికం... రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. అలాంటి కుటుంబానికి పెద్ద కష్ఠమే వచ్చి పడింది. కుటుంబాన్ని కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు ఫేలయ్యాయి.ఇలాంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని తన భార్యనే కంటికి రెప్పలా చూసుకుంటుంది.తన కిడ్నీ భర్తకి సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో కిడ్నీ ఇచ్చేందుకు సిద్దమయ్యింది.అయితే వైద్య ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి.ఏడేళ్లుగా డయాలసిస్ పై కాలం గడుపుతూ సహయం కోసం సమాజం వైపు ధీనంగా ఎదురు చూస్తుంది ఆ కుటుంబం.

Body:వాయిస్:వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్ ఆటో డ్రైవర్ గా కాలం వెల్లబుచ్చేవాడు.అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ళ క్రితం ఉస్మాన్ రెండు కిడ్నీలు పాడయ్యాయి.దీంతో వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంపాదన లేకపోగా... అప్పులు చేసి,మిత్రులు భందువుల సహాయంతో ఏడేళ్లు నెట్టుకొచ్చారు.రెండు నెలల క్రితం ఉస్మాన్ పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్ ఆసుపత్రిలో పరిక్షలు చేయించింది ఉస్మాన్ భార్య నస్రత్ బేగం.ఉస్మాన్ కిడ్నీలు మార్చాల్సిందేనని డాక్టర్లు తేల్చి చెప్పారు. అన్ని పరిక్షలు నిర్వహించిన డాక్టర్లు ఉస్మాన్ భార్య కిడ్నీ ఉస్మాన్ కు సరిపోతుందని....మార్చడానికి 8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఉస్మాన్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఉస్మాన్ భార్య వైద్యం చేయించే స్థోమత లేక భారంగా బతుకీడుస్తుంది.ఉస్మాన్ ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువు కొనసాగిస్తున్నారు.ఉస్మాన్ కిడ్నీ మార్పిడి కోసం ఎవరైన దయార్థులు ఆపన్న హస్తం అందిస్తారని ధీనంగా ఎదురు చూస్తుంది ఆ కుటుంబం.
బైట్స్:
1)ఉస్మాన్ (కిడ్నీ వ్యాధి భాదితుడు)
2)నస్రత్ బేగం (ఉస్మాన్ భార్య)

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.