ETV Bharat / city

గల్లీల్లో నకిలీ డాక్టర్ల దందా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం - హైదరాబాద్​లో నకిలీ డాక్టర్లు

తీవ్ర అనారోగ్యంతో తెలంగాణలోని నిమ్స్‌లో చేరిన ఓ మహిళకు వివిధ పరీక్షలు చేయగా మూత్ర పిండాలు వైఫల్యం చెందినట్లు వైద్యులు గుర్తించారు. వివిధ అనారోగ్య సమస్యల నుంచి ఎప్పటికప్పుడు ఉపశమనం పొందడానికి దీర్ఘకాలికంగా నొప్పి నివారణ మందులు వాడుతున్నట్లు తేలింది. స్థానికంగా ఉన్న వైద్యుడు అందించే ఈ వైద్యం... ఆమె కిడ్నీకు చేటు తెచ్చింది.

fake-doctors-held-in-hyderabad
తెలంగాణ: గల్లీల్లో నకిలీ డాక్టర్ల బాగోతం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
author img

By

Published : Dec 21, 2020, 12:12 PM IST

ఆమె మాత్రమే కాదు.. నిమ్స్‌కు మూత్రపిండాల వైఫల్యంతో వస్తున్న వారిలో 10 - 15 శాతం కేసులు ఈ తరహావే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిపుణులైన వైద్యుల సూచనలు లేకుండా నొప్పి నివారణ, యాంటాసిడ్‌ మందులు వాడటం చాలా ప్రమాదకరమని సూచిస్తున్నారు. అరకొర జ్ఞానంతో సేవలు అందించే ఆర్‌ఎంపీలు, నకిలీ వైద్యుల ప్రభావం ఇప్పుడు నగరంపై కూడా పడుతోంది. తాజాగా సంఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

హైదరాబాద్​ను నకిలీ వైద్యులు ఠారెత్తిస్తున్నారు. కొందరు ఎంబీబీఎస్‌ డిగ్రీలే కాదు..స్పెషలైజన్స్‌ డిగ్రీలు పెట్టుకొని దర్జాగా వైద్య సేవలు అందిస్తున్నారు. దాదాపు వందమందితో కూడిన నకిలీ వైద్యుల జాబితాను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేయడం ఇటీవల సంచలనం సృష్టించింది. ఎలాంటి ఎంబీబీఎస్‌ డిగ్రీ లేకున్నా సరే.. వివిధ ఆసుపత్రుల్లో పనిచేసిన కొద్దిపాటి అనుభవంతో ఏకంగా క్లినిక్‌లను తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం బయటపడింది. వారం రోజుల క్రితం కొవిడ్‌ రోగికి వైద్యం పేరుతో ఏవో చికిత్సలు చేసి చివరికి అతని ప్రాణాలు కోల్పోవటానికి కారణం కావడంతో పోలీసులు వైద్యుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. అక్కడ నుంచి తీగలాగితే నకిలీ వైద్యుల డొంక కదలింది.

ఎలా చేస్తున్నారు?

* నగరంలోని చిన్న చిన్న బస్తీలు, గల్లీలు, కాలనీలే అడ్డాలుగా క్లినిక్‌లు తెరిచి ఇలాంటి వారు వైద్య సేవలు అందిస్తున్నారు.

* తొలుత చిన్న చిన్న సమస్యలకు ప్రాథమిక వైద్యం అందించి రోగుల్లో నమ్మకం కల్పిస్తున్నారు.

* పది రకాల మందుల గురించి తెలుసుకొని లక్షణాలు బట్టి అవే రోగులకు అందిస్తుంటారు.

* యాంటీ బయోటిక్స్‌, పెయిన్‌ క్లిల్లర్స్‌ లాంటి మందులతో తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుండటంతో చాలామంది వీటినే ఆశ్రయిస్తున్నారు. అంతేకాక తక్కువ ఫీజు కూడా ఒక కారణం.

రుజువైతే ఏడేళ్లు శిక్ష

● చాలామంది విదేశీ యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేసినట్లు పట్టాలు చూపుతున్నారు. ఆరా తీస్తుంటే అవన్నీ నకిలీ యూనివర్సిటీలే. కొందరైతే దొంగ డిగ్రీలు పుట్టిస్తున్నారు. నకిలీ డిగ్రీ అని తేలితే పోలీసులు 420 సెక్షన్‌ ప్రకారం కేసులు పెడుతున్నారు. దీనివల్ల ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక చికిత్స చేసి ఎవరి చావుకైనా కారణమైతే 302, 304(ఎ) సెక్షన్ల కింద కేసు పెడుతున్నారు. రుజువైతే ఏడేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడుతుంది.

నష్టం ఏంటి?

* యాంటీబయోటిక్స్‌ దీర్ఘకాలంగా వాడటం వల్ల కిడ్నీలే కాదు...శరీరంలోని ఇమ్యూనిటీపై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు.

* వైద్యుని వద్దకు వెళ్లేముందు కనీస అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పెయిన్‌ కిల్లర్‌ ఇవ్వాలంటే తొలుత సదరు రోగి కిడ్నీ పనితీరు తెలుసుకోవాలి. అప్పటికే కిడ్నీ జబ్బు ఉంటే పెయిన్‌ కిల్లర్‌ ఇస్తే చాలా ప్రమాదకరం. ఇక తక్కువ రక్తపోటు ఉన్న రోగికి కొన్ని రకాల పెయిన్‌ కిల్లర్స్‌ ఇవ్వకూడదు.

నగరంలో పరిస్థితి

* గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు చిన్న పెద్ద ఆసుపత్రులు 4 వేల వరకు ఉన్నాయి. ఇక ఒకే గదిలో కొనసాగే క్లినిక్‌లకు లెక్క లేదు. ఒక్కో గల్లీలో కనీసం 3-5 వరకు ఉంటున్నాయి. మొత్తం కలిపి వేల సంఖ్యలోనే ఉన్నాయి.

* ఏదైనా సంఘటన జరిగి అధికారులకు ఫిర్యాదులు వెళ్తే తప్ఫ. వీరిపై ఎలాంటి నిఘా ఉండటం లేదు. బాలాపూర్‌లో నకిలీ వైద్యుని అవతారమెత్తిన సాయికుమార్‌పై ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. జియాగూడలో ఏకంగా ఏడుగురు నకిలీ వైద్యులను గుర్తించారు. గత పదేళ్లలో 50-70 మందిపై నకిలీ వైద్యులపై కేసులు పెట్టారు.

ఇదీ చూడండి:

సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.