ETV Bharat / city

కువైట్‌లో కష్టాల్లో 1900 మంది ప్రవాసాంధ్రులు

డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఆశతో అక్కడికెళ్లారు వారంతా. లాక్​డౌన్ కారణంగా చేతిలో పని లేదు...జేబులో డబ్బు లేదు. సొంతూరు వెళ్లడానికి చిల్లిగవ్వ కూడా లేని దీన స్థితిలో ఉన్నారు కువైట్​కు వెళ్లిన ప్రవాసాంధ్రులు. కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉండలేక... వారు పెట్టిన తిండి తినలేక పడరాని పాట్లు పడుతున్నారు. వారిని సొంతగూటికి తరలించాలని సీఎం జగన్​ను వేడుకుంటున్నారు.

exiles suffering in kuwait due to lock down affect
కువైట్‌లో కష్టాల్లో 1900 మంది ప్రవాసాంధ్రులు
author img

By

Published : Jun 3, 2020, 7:51 AM IST

కొద్ది రోజులు కష్టపడితే చాలు చేతినిండా డబ్బులు సంపాదించుకోవచ్చన్న ఆశతో కువైట్‌కు వెళ్లిన పలువురు ప్రవాసాంధ్రులు.. ప్రాణాలతో సొంతూళ్లకు చేరితే అదే పదివేలు అనుకుంటున్న దైన్య పరిస్థితి ఇది. కువైట్‌ క్షమాభిక్ష(ఆమ్నెస్టీ)కు దరఖాస్తు చేసుకున్న (పాస్‌పోర్టు ఉండి స్థానికంగా ఉండటానికి అనుమతిలేని) వారిలో ఇప్పటికే 300 మంది రాష్ట్రానికి చేరినా... ఇంకా 1900 మంది అక్కడే చిక్కుకుపోయారు. వారంతా ఉపాధికి దూరమై, చేతిలో నగదు ఆవిరై స్వరాష్ట్రానికి రాలేక దేశంకాని దేశంలో ఉండలేక పడరాని పాట్లు పడుతున్నారు.

50రోజులుగా షెల్టర్లలోనే...

కువైట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో చేరిన మొదట్లో వారం, పది రోజుల్లో స్వదేశానికి వెళ్లొచ్చని సంబరపడ్డామని, ఇప్పుడు 40-50 రోజులవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారని, తాము మాత్రం అక్కడే ఉండిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని పోలీసులు నిలిపేస్తున్నారని వాపోయారు. కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు ‘ఈనాడు, ఈటీవీ భారత్’కు ఫోన్‌లో వారి పరిస్థితిని వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే...

బీపీ నియంత్రణకు ఉల్లిపాయ తింటున్నా

exiles suffering in kuwait due to lock down affect
కువైట్‌లో కష్టాల్లో 1900 మంది ప్రవాసాంధ్రులు

'కబ్దీ షెల్టర్‌లోకి గత నెల 27వ తేదీన వచ్చా. నాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 77 మంది ఇక్కడున్నారు. నాకు మధుమేహం, బీపీ ఉన్నాయి. మందుల్లేక బీపీ నియంత్రణకు రోజూ ఉదయం ఉల్లిపాయ తింటున్నా. ఇక్కడ పెట్టే అన్నం తినలేక పోతున్నా. అరగంట ఆలస్యమైతే ఆ మెతుకులు సాగుతున్నాయి, దుర్వాసన వస్తోంది. రోజు మొత్తానికి రెండు బాటిళ్ల నీళ్లే ఇస్తున్నారు. అవి సరిపోవడంలేదు' - సి.భాస్కర్‌, తిరుపతి

అంతా వెళ్లిపోతున్నా మేమిక్కడే మిగిలిపోయాం

షెల్టర్‌లోకి వచ్చి 45 రోజులైంది.... కేరళ, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల వారు వెళ్లిపోయారు. మమ్మల్ని మాత్రం వెనక్కి పంపిస్తున్నారు. ఇంటి దగ్గర భార్య, బిడ్డలు ఆందోళన చెందుతున్నారు.

- డేవిడ్‌, రామచంద్రాపురం

పాప ఎండ వేడిని తట్టుకోలేకుంది.

కువైట్‌లో ఉపాధి లేక సొంతూరికి వెళదామని 9 నెలల పాపతో కలిసి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా. నెలన్నరగా షెల్టర్‌లో ఉంటున్నా. నేను మూడు నెలల గర్భిణీని. వాంతులు ఎక్కువ అవుతున్నాయి. నీరసంగా ఉంటోంది. పాపకు పాలు ఇస్తున్నారు గానీ అవి సరిపోవడం లేదు. నాతోపాటు ఏపీకి చెందిన 90 మంది మహిళలు, వృద్ధులు ఇక్కడ ఉన్నారు. అందరూ ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ స్పందించి త్వరగా రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి.

- లక్ష్మీ, పులివెందుల

మూడు వారాల్లో రాష్ట్రానికి తీసుకువస్తాం

కువైట్‌ షెల్టర్లలో ఉంటున్న వారిని రెండు నుంచి మూడు వారాల్లో రాష్ట్రానికి తీసుకువస్తాం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.-ఇలియాజ్‌,డైరెక్టర్‌, ఏపీఎన్‌ఆర్‌టీ

ఇదీ చదవండి:

'కళ'తప్పిన బతుకులు.. కష్టాల కడలిలో జీవితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.