ETV Bharat / city

మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపూ తప్పదా..? - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడం వల్ల.. నల్గొండ-ఖమ్మం- వరంగల్​ స్థానంలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ స్థానంలోనూ ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పేలా లేదు. ఈ రెండు చోట్ల స్పష్టత రాకపోతే మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంటుంది.

Telangana graduate mlc counting
తెలంగాణ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
author img

By

Published : Mar 19, 2021, 8:18 AM IST

తెలంగాణలోని.. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే ఎవరికి ఆధిక్యం రాలేదు. చెల్లిన ఓట్లలో సగటున 30 శాతం తెరాస అభ్యర్థి పల్లాకు, 22 శాతం తీన్మార్‌ మల్లన్నకు, 19 శాతం కోదండరాంకు వచ్చాయి. ఎవరికి ఆధిక్యం రానందున రెండో ప్రాధాన్య ఓట్లు కీలకంగా మారింది. ఇందులో ఎలిమినేషన్‌ ప్రక్రియలో గెలవాలంటే పల్లాకు 20 శాతం ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 28 శాతం, కోదండరాంకు 31 శాతం ఓట్లు రావాలి. అయితే రెండో ప్రాధాన్య ఓట్లలోనూ ఇంత శాతం గతంలో ఎప్పుడూ రాలేదని మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకూ అవకాశాలున్నాయని, అందుకు సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు వెల్లడించాయి.

గత ఎన్నికల్లో... రెండో ప్రాధాన్య ఓటుతోనే

గత ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు. 2015లో మొత్తం 1,33,553ఓట్లు పోలవగా గెలుపుకోటా 66,777గా నిర్ణయించారు. పల్లాకు తొలి ప్రాధాన్య ఓట్లలో 59,764 రాగా, రెండో స్థానంలో నిలిచిన భాజపా అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకు 47,041 వచ్చాయి. అప్పుడు మొత్తం 22 మంది పోటీ చేయగా, 18 మందిని ఎలిమినేషన్‌ ప్రక్రియ ద్వారా తొలగించారు. చివరగా పల్లాకు 67,183ఓట్లు రాగా, భాజపా అభ్యర్థికి 55,243 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన తీన్మార్‌ మల్లన్నకు 13,033 ఓట్లు వచ్చాయి.

హైదరాబాద్‌ సరళి చూస్తే...

హైదరాబాద్‌ స్థానంలో అభ్యర్థులకు ఆరో రౌండు వరకు పోలైన ఓట్ల సరళి చూస్తే ఎన్నిక ఏకపక్షం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ముందు వరుసలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. మూడో స్థానంలోని ప్రొ.నాగేశ్వర్‌కు వచ్చిన ఓట్లకు, రెండో స్థానంలోని అభ్యర్థి సాధించిన ఓట్లకు భారీ తేడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వాణీదేవి 33.55% ఓట్లు దక్కించుకోగా, రాంచందర్‌రావు 30.74%, నాగేశ్వర్‌ 16.14% దక్కించుకున్నారు. బరిలోని 93 మంది అభ్యర్థుల్లో ఈ ముగ్గురే 80.43% ఓట్లు పొందారు.

అంచనాలు ఇలా..

అంచనాగా కోటా ఓట్లు (చెల్లుబాటు అయిన ఓట్లలో 50శాతం+1) సాధించేందుకు వాణీదేవి 16.5%, రాంచందర్‌రావు 20%, నాగేశ్వర్‌ 34% ఓట్లను రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో చేజిక్కించుకోవాలి. నాగేశ్వర్‌కి దిగువన ఉన్న 19.57% ఓట్లలో సగం మొత్తాన్ని కలిపినా ఆయన రెండో స్థానానికి చేరుకోలేరు. అపుడు మిగిలిన 90 మంది మాదిరి ఆయన కూడా బరి నుంచి వైదొలగడం అనివార్యమవుతుంది. ఇప్పుడు.. వారందరి బ్యాలెట్‌ పత్రాల్లోని రెండో ప్రాధాన్య ఓటు ఎవరిని గెలిపిస్తుందనేది ప్రశ్న. రెండో ప్రాధాన్య ఓట్లను కలిపాక.. వాణీదేవి, రామ్‌చందర్‌రావు ఓట్లను లెక్కిస్తారు. కోటా ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ.. నాలుగో స్థానం నుంచి కిందనున్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు వేసిన వారంతా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు రెండో ప్రాధాన్య ఓటు వేసినట్లయితే.. ఆయన అనూహ్యంగా మొదటి వరుసలోకి వస్తారు. రెండో ప్రాధాన్య ఓట్లతోనూ ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్యఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ప్రక్రియ ఆదివారానికి పూర్తవనుందని అంచనా.

ఇవీచూడండి: ప్రారంభమైన ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.