అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులే సీఎం జగన్‌కు ఇవ్వాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో ఎస్సీల నుంచి భూములు లాక్కున్నారని ఆరోపించారు. జగన్‌తో పాటు రెవెన్యూ మంత్రికి నోటీసులు ఇవ్వాలన్న ఆయన... ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. నెల్లూరులో సోదాలు