రాజధాని అంశంతో పాటు ప్రణాళికలను సమీక్షించి ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ, హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ కమిటీల సిఫారసు ఆధారంగా ప్రభుత్వం చేపట్టిన తదుపరి చర్యలన్నింటిని రద్దు చేయాలని కోరారు.
2018 సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం జీవో 585 ద్వారా జీఎన్ రావు సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక సహేతుకంగా లేదని పేర్కొన్నారు. కమిటీలోని సభ్యులు సంబంధిత విషయంలో నిపుణులు కాదని పిల్లో వివరించారు. 2018 డిసెంబర్ 20న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరారు. నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను పరిశీలించే నిమిత్తం 2019 డిసెంబర్ 29న జీవో 159 ద్వారా ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అభ్యర్థించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... చీరాల పోలీసులపై చర్యలు తీసుకోవాలి: నాదెండ్ల