గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్‌తో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో చర్చించి భారత్ భౌగోళిక పటంలో అమరావతికి చోటు కల్పించిన నాయకుడు గల్లా జయదేవ్ అని గుర్తు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిచిన జయదేవ్‌ను పోలీసులు దారుణంగా హింసించడం బాధాకరమన్నారు. కొట్టడమే కాక ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోమిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఎంపీని కొట్టి జైల్లో పెడతారా: ట్వీట్టర్‌లో సోమిరెడ్డి - పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ తాజా వార్తలు
పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్‌తో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్టర్‌లో స్పందించారు. ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్ చేశారు.