కోర్టులో అడ్డంకి లేకపోయినా పట్టాల పంపిణీ రెండుసార్లు ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని తెదేపా అడ్డుకుంటుందని వైకాపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తెదేపా హయాంలో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. వైకాపా నేతల వాటాల పంపకంలో విబేధాలే వచ్చినందునే పట్టాల పంపిణీ ఆపేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: