విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి 11 మంది మృతి చెందడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన యార్డులో ఇలా జరగడం దురదృష్టకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారంతా ఒప్పంద కార్మికులేనని.. ప్రభుత్వం వారి కుటుంబాలకు శాశ్వత పరిష్కారం దిశగా సహాయం చేయాలని గంటా అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు వారి భవిష్యత్కూ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాద ఘటనపై విచారణ చేయించి.. వైఫల్యాలను సరిదిద్దాలని అన్నారు.
విశాఖలో ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. భయాలను పారద్రోలి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి..