కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన.. వైకాపా ప్రభుత్వానికి మానవత్వం లేదని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి తన గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు హాజరైనట్లు తెలిపారు. కరోనా సమయంలో విచారణకు హాజరు కావాల్సి వస్తోందన్నారు. జైలులో పెట్టినా.. ప్రశ్నిస్తూ, పోరాడుతూ ఉంటానని తెలిపారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని.. మొదటి సారి టీకా తీసుకున్నవారికి రెండో డోసు వేయించలేని పరిస్థితి ఉందన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అమూల్ సంస్థ కోసం, సంగం డెయిరీ ఆస్తుల్ని తాకట్టు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు.
ఇదీ చదవండి: సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమ