బాలినేని వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందిచటం లేదని మాజీమంత్రి జవహార్ ప్రశ్నించారు. బాలినేని జగన్ బంధువు కాబట్టి మాట్లాడం లేదా అని నిలదీశారు. చెన్నై నుంచి ఆ నిధులు మారిషస్ కు తరలించేందుకు ప్లాన్ చేశారనేది వాస్తవం కాదా అని మండిపడ్డారు. 5 కోట్లకు పైగా డబ్బు చెన్నై పంపుతూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డంగా బుక్కయ్యారని ఆరోపించారు. ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: