ETV Bharat / city

తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్​కు తృటిలో తప్పిన ప్రమాదం - hyderabad latest news

Swamy Goud తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్​కు తృటిలో ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. గుంతలున్న రోడ్ల వలనే తనకు ప్రమాదం జరిగిందని.. స్వామిగౌడ్ అధికారులపై మండిపడ్డారు.

swamy goud
swamy goud
author img

By

Published : Aug 14, 2022, 3:40 PM IST

Swamy Goud: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు గండిపేట మండల పరిధిలో పార్టీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్, భాజపా నేత స్వామి గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కిస్మత్ పూర్​లోని తన ఇంటికి వస్తుండగా రోడ్డు పైనున్న గుంతలలో బైక్ స్కిడ్ కావడంతో స్వామి గౌడ్ కింద పడిపోయాడు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కాగా బైక్​పై నుండి పడటంతో కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్లు తెలిపారు.

ఇవాళ్టి ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమై కారణమని స్వామి గౌడ్ మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు గండిపేట మండల పరిధిలో రోడ్లు పూర్తిగా గుంతలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని అధికారులకు పలుమార్లు సూచించినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేదని స్వామి గౌడ్ ఆరోపిస్తున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.