ETV Bharat / city

పోలింగ్​కు సర్వం సిద్ధం.. పరిశీలనకు ప్రత్యేకాధికారులు - AP Municipal Election Polling News

రాష్ట్రంలో పురపోరుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరగనుంది. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు . సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.

పోలింగ్​కు సర్వం సిద్ధం.. పరిశీలనకు ప్రత్యేకాధికారులు

author img

By

Published : Mar 9, 2021, 10:14 PM IST

Updated : Mar 10, 2021, 5:04 AM IST

పోలింగ్​కు సర్వం సిద్ధం

రాష్ట్రంలో పోలింగ్ సందడి నెలకొంది. 12 కార్పొరేషన్లు, 75 పురపాలికలు, నగర పంచాయతీల్లోని 2వేల 794 వార్డులకు ఎన్నికల సంఘం గతేడాది మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చింది. కరోనా వల్ల నిలిచిన ఎన్నికలను..... ఈ నెల 2 నుంచి తిరిగి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతో ప్రారంభించింది.12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా.. వీటిలో 90 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 581 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. 2వేల 571 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు..

75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 2వేల 123 వార్డులుండగా... 490 ఏకగ్రీవమయ్యాయి. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలికల్లో అన్నింటిని వైకాపా ఏకగ్రీవం చేసింది. మిగిలిన 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 16వందల 33 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 4వేల 981 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కలిపి 7వేల 549 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 77 లక్షల 73 వేల 231మంది ఓటర్లు ...అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.

అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు..
గుంటూరు నగరపాలికతో పాటు తెనాలి, రేపల్లె, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ పురపాలికలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 238 వార్డుల్లో 758 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని...9 లక్షల 26 వేల 64 మంది ఓటర్లు తేల్చనున్నారు. విజయవాడ నగరపాలికలో 64డివిజన్లలో పోలింగ్ జరగనుంది. 347 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వీరిలో 184మంది మహిళా అభ్యర్ధులు ఉన్నారు. 7లక్షల 81వేల 640ఓటర్లు ఓటు వేయనున్నారు. సాయంత్రం 5గంటలలోపు ఎంతమంది క్యూలైన్లలో ఉంటే అంతమందికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. చుండూరి వెంకటరెడ్డి ప్రభుత్వ నగరపాలక ఉన్నత పాఠశాలలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు ఓటు వేయనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..
జిల్లాలో ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. ఏలూరు నగరపాలికలో 50 డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2 లక్షల 32వేల 972 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని పురపాలికలు........ ముమ్మడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 268 వార్డులు ఉండగా... 35 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 233 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 3లక్షల 52 వేల 136 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

విశాఖ జిల్లాలో..
జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఎన్నిక జరుగనుంది. విశాఖలో 98డివిజన్లు, ఎలమంచిలిలో 22, నర్సీపట్నంలో 28 వార్డులకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. 18 లక్షల 5వేల 311మంది ఓటు వేయనున్నారు.

విజయనగరం జిల్లాలో..
విజయనగరం కార్పొరేషన్‌తో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు... నెల్లిమర్ల నగరపంచాయతీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో..
ఒంగోలు నగరపాలికతో పాటు మార్కాపురం, చీరాల పురపాలికలు.... గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు నగరంలో 49చోట్ల.. చీరాలలో 30 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్కాపురంలో 30, చీమకుర్తిలో 19, కనిగిరిలో 13, గిద్దలూరులో 13, అద్దంకిలో 19 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి చోట వెబ్‌ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు జిల్లాలో..
ఆత్మకూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట పురపాలకల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 52వార్డుల్లో 158మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 76వేల 219మంది ఓటింగ్ లో పాల్గొననున్నారు. అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

మొత్తం 7,915 పోలింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 7 వేల 915 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కార్పొరేషన్లలో 12వందల 35 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా, 11వందల 51 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా తేల్చింది. మున్సిపాలిటీలలో 1233 సమస్యాత్మక, 1169 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. వీటిలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బంది చొప్పున కేటాయించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 48 వేల 723 సిబ్బందిని ఎన్నికల్లో వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

పరిశీలన..
కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రక్రియను ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా పరిశీలించనున్నారు. గుంటూరులో పోలింగ్‌ను ఎన్నికల‌ కమిషన్ కార్యదర్శి కన్నబాబు, విశాఖలో అదనపు డీజీ సంజయ్ సహా విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా పరిశీలిస్తారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నిక కమిషన్ హెచ్చరించింది.

అవాంఛనీయ ఘటనల వల్ల పోలింగ్ నిలిచిపోయిన చోట...13న రీపోలింగ్ నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించింది. 14న ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... అమరావతి మహిళలపై దాడి దారుణం: చంద్రబాబు

Last Updated : Mar 10, 2021, 5:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.