పురపాలక ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. మార్చి 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుందన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. అందుకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం సమన్వయంతో చేస్తోందన్నారు. ప్రజలందరూ కలిసి పురపాలక ఎన్నికలను జయప్రదం చేయాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ముందుగా స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు, సిబ్బంది అందించనున్నారు.
ఇదీ చదవండీ...ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్న అభ్యర్థులు