ETV Bharat / city

ఇంటి సర్వే గుట్టు ఎవరికి ఎరుక? - ap survey latest news

ఇంటింటి సర్వే తీరు, వివరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంటింటికి వెళ్లి సర్వే చేయకుండా కొంత సిబ్బంది ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నారు. కరోనా వైరస్​ రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి 4 సార్లు సర్వే జరిగింది. సర్వేల్లో 4 లక్షల కుటుంబాల వివరాల నమోదు ఇప్పటికీ జరగలేదు.

every house survey is not going correctly by anm and asha workers in ap
గృహాలకు వెళ్లకుండానే వెళ్లినట్లు నమోదు!
author img

By

Published : May 26, 2020, 7:49 AM IST

ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే తీరు

ఇంటింటి సర్వే చేయకుండానే కొందరు ఆరోగ్య సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తి నివారణ జరగకపోగా... ఎంతోమందికి నష్టం చేకూరుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఎ.ఎన్‌.ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేయిస్తోంది. వాలంటీర్ల సాయంతో వార్డు/సచివాలయ ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వైరస్‌ అనుమానిత లక్షణాలుంటే పరిశీలించాలి.

జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, వృద్ధులకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినట్లయితే వారి వివరాలు మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలి. ఈ క్రమంలో సర్వే వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించినప్పుడు.. కొన్నిచోట్ల ఇళ్లకు వెళ్లకుండానే ఆరోగ్య సిబ్బంది తమకు తోచిన విధంగా వివరాలు నమోదు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలో 1,45,25,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4సార్లు సర్వే జరిగింది. సర్వేల సమాచారాన్ని అధికారులు నిశితంగా పరిశీలించినప్పుడు.. కొన్ని కుటుంబాల వివరాలు అసలు వైద్య ఆరోగ్య శాఖకు అందడంలేదు. ఇంకొన్నిచోట్ల తక్కువ రోజుల్లో, గంటల వ్యవధిలో ఎక్కువ ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించినట్లు మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇలా సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు జిల్లా అధికారుల్లోనే వ్యక్తమవుతున్నాయి.

అపార్టుమెంట్లకు వెళ్లకుండా, ప్లాట్లలో ఉండే కుటుంబ సభ్యులను కలువకుండానే పక్కనున్న వారు ఏది చెబితే అది రాసేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, ఇతర జిలాల్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. 4వ సర్వేలో 4 లక్షల కుటుంబాల వివరాలు నమోదు ఇప్పటివరకు జరగలేదు. విశాఖ, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది.

సమస్యలున్నాయి
ఇంటింటి సర్వేకు వెళ్లిన సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేరని ఆరోగ్య సిబ్బంది నుంచి జిల్లా అధికారులకు సమాధానం వస్తోంది. అపార్టుమెంట్లు, భవనాల్లో నివాసం ఉండే వారిని కలిసి వివరాలు సేకరించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నట్లూ చెబుతున్నారు.

సర్వే సమాచారానికి ప్రాధాన్యం
ఆరోగ్య సిబ్బంది ఇచ్చే సమాచారానికి వైద్య ఆరోగ్య శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 5వ సర్వేను వైద్య ఆరోగ్య శాఖ చేపట్టింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ జిల్లా అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో సర్వే సక్రమంగా జరగకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆరోగ్య సిబ్బంది ఇళ్లకు వెళ్లినప్పుడు పరిసరాల్లో దోమల వృద్ధికి అవకాశం ఉండే నీటి నిల్వలు ఉన్నట్లయితే ఆ వివరాలు మొబైల్‌ యాప్‌లో నమోదుచేయాలి. కుటుంబ సభ్యులను వాటిపట్ల చైతన్యం చేయాలి. ఈ వివరాలను, కేసుల నమోదు సమయంలో పరిగణనలోనికి తీసుకుంటారు. ఆరోగ్య కార్యకర్తల ఇంటింటి సర్వే తీరును వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేయనుంది.

మా దృష్టికొచ్చింది- అప్రమత్తం చేశాం

ఈ విషయం మా దృష్టికొచ్చింది. మొబైల్‌ యాప్‌లో వివరాల నమోదు ఎక్కడ? ఎలా? ఏ ప్రాంతంలో జరిగిందో? సాంకేతిక పరిజ్ఞానం ద్వారా (జీయో ట్యాగ్‌) గుర్తించాం. ఈ ప్రక్రియ కొన్నిచోట్ల పారదర్శకంగా జరగలేదు. ఆ వివరాలను గణాంకాలు సహా జిల్లా అధికారులకు పంపించాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. సమస్యలుంటే పరిష్కరిస్తామని కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కాటంనేని భాస్కర్​ తెలిపారు.

every house survey is not going correctly by anm and asha workers in ap
గృహాలకు వెళ్లకుండానే వెళ్లినట్లు నమోదు!

ఇదీ చదవండి :

సర్వేయర్ చేష్టలు ... మహిళతో అసభ్య ప్రవర్తన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.