- పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి
పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో విద్యార్థులను ఒకచోట చేర్చడం సరైన ఆలోచన కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్ బెదిరింపులకు లొంగను
జగన్ బెదిరింపులకు తాను భయపడనని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా మాచిరెడ్డిపల్లికి వచ్చిన ఆయన.. సీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకొనే.. తమ బస్సులను ఆపేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూర్యాపేటలోనే కల్నల్ సంతోష్ అంత్యక్రియలు
చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు అమరుడవడంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఆయన స్వస్థలం సూర్యాపేటలో అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీర జవాను ప్రస్థానం
దేశ ప్రజల ‘సంతోష’మే తన సంతోషం అనుకున్నారు కల్నల్ సంతోష్‌బాబు. తండ్రి ఆశయ సాధనకు, తన లక్ష్యంపై గురిపెట్టి చిన్నప్పటి నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. నాయకుడిగా ఎదిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి
భారత్, చైనా సరిహద్దు అంశమై స్పందించింది బ్రిటన్. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది. హింస ఎవరికీ ఆమోదయోగ్యం కాదని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీ మౌనం వీడాలి
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో 20మంది సైనికులు అమరులు కావడంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వివాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు రాహుల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యమహా ఆటోమెుబైల్ గోదాంలో అగ్నిప్రమాదం
దిల్లీ గ్రేటర్ పరిధిలోని నోయిడాలో యమహా ఆటోమొబైల్ సంస్థకు చెందిన గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జాతీయవాద పులిని రెచ్చగొడుతున్న చైనా
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించింది అమెరికా మీడియా. సరిహద్దు వెంట ఉద్రిక్తతలు పెంచుతూ భారత జాతీయవాద పులిని చైనా రెచ్చగొడుతోందని విశ్లేషించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏ జట్టునైనా ఎదుర్కోగలం
ప్రపంచంలో ఏ జట్టునైనా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తమ జట్టు పేస్ బౌలింగ్‌కు ఉందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు వెస్టిండీస్ సహాయ కోచ్ రోడీ ఎస్ట్‌విక్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్లు కారణమన్నారు బిహార్ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా. వీరందరిపై కేసు కూడా నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.