- నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంలో విచారణ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సీజేఐ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇబ్బంది లేదు
శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోయినా.. శాసనసభ ఆమోదం పొందింది కాబట్టి ఇబ్బందేమీ లేదని శాసనసభ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాటల యుద్ధం
రాష్ట్ర శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మంటలు రేగాయి. మాటల తూటాలు, వాగ్భాణాలు దాటి బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్యే సభ నిరవధికంగా వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధిక్కరిస్తే వేటే
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది తెదేపా. అభ్యర్థిగా బరిలో ఉన్న వర్ల రామయ్యకు ఓటు వేయాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైకత శిల్పంతో ఘన నివాళి
తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు దేశమంతా ఘనంగా నివాళులర్పిస్తోంది. కాగా ప్రసిద్ధ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఇసుకతో వీర సైనికుల బొమ్మలను రూపొందించి... 'ట్రిబ్యూట్ టు అవర్ బ్రేవ్‌హార్ట్స్' అంటూ తనదైన రీతిలో ఘనంగా నివాళులు అర్పించారు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మళ్లీ చర్చలు జరిగేనా?
ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా మేజర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గాల్వన్ ఘర్షణ నేపథ్యంలో గంభీరంగా సాగిన ఈ భేటీలో బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఏకాభిప్రాయం కుదరలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనా ఉపకరణాలపై నిషేధం
చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ అప్‌గ్రెడేషన్‌లో చైనా ఉపకరణాలను వినియోగించొద్దని సూచించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం
ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ)లోని 5 తాత్కాలిక సభ్యదేశాల కోసం బుధవారం (జూన్ 17న) ఎన్నికల్లో భారత్ ఘనవిజయం సాధించింది. ప్లీనరీ సమావేశం లేకుండానే రహస్య బ్యాలెట్ ద్వార ఎన్నికలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచ ఛాంపియన్‌పై సస్పెన్షన్
100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్ క్రిస్టియన్ కోల్‌మన్‌పై నిషేధం విధించింది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. నిర్ణీత వ్యవధిలో డోప్ పరీక్షలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సోషల్ తెరపై మనసు విప్పిన తారలు
సినీతారలకు, అభిమానులకు మధ్య అభిరుచులను పంచుకోవడంలో వేదికగా నిలిచింది సోషల్ మీడియా. ఈ క్రమంలోనే కొంతమంది ముద్దుగుమ్మలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలను తెలియజేస్తూ నెటిజెన్లలో స్ఫూర్తి నింపుతున్నారు. ఆ తారలు ఎవరు... వారు ఏం చెప్తున్నారో తెలుసుకోండి.