ETV Bharat / city

ఆ స్నేహితులు అవసరమా

Friendship కొందరు స్నేహితుల్ని కుటుంబసభ్యుల్లా భావిస్తాం. ప్రతిదీ వారితో పంచుకుంటుంటాం. కానీ, ఇక్కడా కొన్ని పరిధులుంటాయి అంటున్నారు నిపుణులు. లేదంటే మనసుపై నెగెటివ్‌ ప్రభావం పడుతుందంటున్నారు. అటువంటి స్నేహ సంబంధాల గురించి ప్రత్యేకమైన కథనం.

special-article-on-friendship
ఆ స్నేహితులు అవసరమా
author img

By

Published : Aug 17, 2022, 4:46 PM IST

Friendship: స్నేహం అంటే ఇద్దరు కలిసి ఉండటం.. ఒకరి సమస్యలను ఒకరు తెలుకోవడం.. స్నేహితుడు ఉన్నాడు అనే ధైర్యం ఇద్దరిలో కలగాలి. అంతేగానీ స్నేహంలో ఒకవైపు మాత్రమే ఆ ధైర్యం, బంధం ఉండకూడదు. అది స్నేహమనే బంధానికి తూట్లు పొడిచేదిగా ఉంటుంది. అటువంటి స్నేహంలో ఎవరు నిజమైన స్నేహితులు అనే విషయం తెలుసుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి అనే దానిపై కొన్ని సూచనలు:

* స్నేహంలో నీది, నాది అనేది ఉండదు. నిజమే.. కానీ, అది రెండువైపులా ఉంటేనే అందం. అలాకాకుండా తరచూ మీతోనే ఖర్చు పెట్టిస్తుండటం, ప్రతి చిన్నదానికీ మీమీదే ఆధారపడటం మంచిది కాదు. మీ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి అడగడం, మీరు ఇబ్బంది పడుతున్నా.. గమనించక పోవడం నిజమైన స్నేహితుల లక్షణం కాదు.

* మిత్రుల మధ్య థాంక్స్‌, సారీలకు చోటుండదు. ఇదీ వాస్తవమే. కానీ, ఎప్పుడు? చిన్న సాయాలు, తప్పుల విషయంలో. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మిమ్మల్ని బాధపెట్టి, ఆ విషయం తెలిసీ క్షమాపణ అడగలేదంటే.. మీ భావోద్వేగాలకు విలువ ఇవ్వట్లేదనే!

* టాలెంట్‌, నేపథ్యాలు, అంతస్థులు లెక్క లేసుకుని వాటిని చూసి చేసేది స్నేహం కాదు. మనం ఏదైనా సాధిస్తే మనకంటే ఎక్కువ ఆనందం ఫ్రెండ్స్‌కే ఉంటుంది. తనకు రాకపోయినా కనీసం మీకొచ్చినందుకు అభినందించొచ్చు. అలా కాక ఆ ఆనందాన్ని ఆవిరి చేసేలా మాట్లాడుతున్నా, కుంగిపోయేలా చేస్తున్నా వారికి దూరంగా ఉండటమే మంచిది.

* పరిస్థితులు, సమయానికి తగ్గట్టుగా ఎవరైనా మారాల్సిందే. అయితే ఆ మార్పు మీకూ సౌకర్యవంతంగా ఉండాలి. దుస్తులు, తీరు విషయంలో మీ విలువలతో రాజీపడాల్సి వస్తే కుదరదని చెప్పండి. అయినా బలవంతం చేస్తోంటే.. మీ అభిప్రాయానికి విలువనివ్వట్లేదనే! అలాంటివారు మీకు స్నేహితులెలా అవుతారు.

* కనిపించే తీరు, ప్రవర్తన, ధరించే వస్త్రాలు.. ఇలాంటి కొన్ని విషయాల్లో చాలామందిలో ఆత్మన్యూనత ఉంటుంది. దాన్ని పోగొట్టకపోయినా ఫర్లేదు.. కానీ, ఎత్తిచూపుతోంటే వాళ్లు స్నేహితులవరు. పక్కన ‘మన’ అన్నవారెవరైనా ఉంటే మనసుకు స్థిమితంగా ఉండాలి. మనం మనలా ఉండగలగాలి. అలా లేరంటే మన వాళ్లు కాదనే.. స్నేహితులు అంతకన్నా కాదనే! వారికి వీలైనంత దూరంగా ఉండటం మేలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.