ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - telugu update news

టాప్ టెన్ న్యూస్

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : May 4, 2021, 9:00 AM IST

  • తిరుమలలో అగ్నిప్రమాదం... ఆరు దుకాణాలు దగ్ధం

తిరుమలలోని ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైద్య కళాశాలల నిర్మాణాలు వేగవంతం చేయండి: సీఎం జగన్

వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమంలో నాడు-నేడు పనులు, వైయస్సార్ కంటి వెలుగు పథకంపై.. సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రేషన్‌ పంపిణీకి బయోమెట్రిక్ భయం

కరోనా విజృంభణ తీవ్రమై..ఇంటి దగ్గరే ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తుండగా రేషన్‌ సరకులు పంపిణీ చేసే వారు మాత్రం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితితో సతమతమవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సరకుల పంపిణీ చేసి తిరిగి క్షేమంగా తమ ఇంటికి వస్తామో లేదోనన్న ఆలోచన.. వారిలో గుబులు పుట్టిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ పాస్‌ మిషన్‌పై లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోవాలంటేనే జంకుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తిరుమల విశిష్టత పెంచేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ గురుమూర్తి

తిరుపతి ఉపఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూసేవ చేస్తానని వైకాపా ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను సీఎం వైఎస్ జగన్ సహాకారంతో పరిష్కరిస్తానని అన్నారు. తిరుమల విశిష్టతను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ రాష్ట్రంలో.. కుంభమేళాకు వెళ్లిన వారందరికీ కరోనా!

హరిద్వార్​ కుంభమేళాకు వెళ్లిన మధ్యప్రదేశ్​ ప్రజలందరికీ కొవిడ్​ సోకినట్లు తెలుస్తోంది. ఇందులో 60 మంది విదిశ జిల్లా వాసులే ఉండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​తో బ్రిటన్​ భారీ వాణిజ్య ఒప్పందం

భారత్​- బ్రిటన్​ మధ్య వాణిజ్య బంధం మరింత బలపడనుంది. భారత్​తో జీబీపీ 1 బిలియన్​ విలువ గల ఒప్పందాన్ని బ్రిటన్​ ప్రకటించింది. మంగళవారం జరగనున్న బోరిస్​- మోదీ సమావేశంలో దీనిపై నేతలు సంతకాలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2022 డిసెంబర్​లోగా ప్రధానికి నూతన నివాసం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా చేపట్టిన ప్రధానమంత్రి నివాస భవనం వచ్చే ఏడాది డిసెంబర్​ నాటికి అందుబాటులోకి రానుంది. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ నిర్మాణ పనుల్ని కేంద్రం 'అత్యవసర సేవ'గా గుర్తించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరం: పరిశ్రమ సంఘాలు

దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తాము నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 67శాతం మంది లాక్‌డౌన్‌కు మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో రవాణా పరిమితులు విధించాలని ఫిక్కీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ మిగతా మ్యాచ్​లు ముంబయిలోనే!

ఐపీఎల్​లో కొవిడ్ కేసులు వెలుగు చూడటం వల్ల మిగతా టోర్నీని ముంబయికి తరలించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ నివేదికను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వకీల్​సాబ్​' చిత్రంపై ఫిర్యాదు!

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్​' చిత్రంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. సినిమాలో హీరోయిన్​ అంజలి ఫొటోతో పాటు తన చరవాణి నంబరు జత చేయడం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు కాల్​ చేసి వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.