- ఏపీలో 90లక్షలు దాటిన కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు 90 లక్షల మార్క్ దాటింది. ఇప్పటివరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 90,21,225 శాంపుల్స్‌ని పరీక్షించగా 8,51,298 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 80,737 నమూనాలను పరీక్షించగా 1,593 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సీఎం జగన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు !
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందే అవకాశముందని వెల్లడించారు. నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే సీఎం పదవికి జగన్ రాజీనామా చేసే అవకాశం లేకపోలేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- సీఎం ఆదేశాలు పాటించండి
విశాఖ వైకాపా పంచాయితీ సీఎం చెంతకు చేరిన వేళ.. పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో.. సంస్థాగత అంశాలను బహిరంగ వేదికలపై మాట్లాడొద్దనే నియమావళిని... ఉల్లంఘించవద్దని నేతలకు విజయసాయిరెడ్డి గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- స్థిరంగా ఉపరితల ద్రోణి
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పాకిస్థాన్ కాల్పులు- ముగ్గురు జవాన్లు, పౌరులు మృతి
దాయాది దేశం పాక్ మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతుంది. భారత జవాన్ల కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన పాక్ సైనికుల్లో కొందరు చనిపోయినట్లు సమాచారం. అంతకు ముందు పాక్ రేంజర్లు, ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, మరో ముగ్గురు పౌరులు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 15న బిహార్ శాసనసభాపక్ష నేత ఎన్నిక
బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఈ నెల 15న సమావేశం కానున్నారు. సీఎం నితీశ్ కుమార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- అమెరికా ఎన్నికలపై చైనా స్పందన
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనా.. జో బైడెన్, కమలా హారిస్‌లకు అభినందనలు తెలిపింది. అమెరికా ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. అగ్రరాజ్య ఎన్నికలపై తొలుత ఎలాంటి ప్రకటన చేయని చైనా.. తాజాగా స్పందించడం గమనార్హం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కోహ్లీ ది బెస్ట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత పితృత్వపు సెలవుపై భారత్ వెళ్లాలన్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయం సరైనదేనని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. కోహ్లీ భార్య అనుష్క ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండాలనే ఆలోచనను తాను గౌరవిస్తున్నట్లు లాంగర్ తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- నాకు బాయ్‌ఫ్రెండ్స్ ఎక్కువ
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు క్రేజీ విషయాలను వెల్లడించింది రకుల్. ప్రతిరోజూ ఏదో ఒక అడ్వెంచర్ చేస్తుంటానని చెప్పింది. ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపాలని అభిమానులకు సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ధరలు ప్రియం... ధనత్రయోదశి అమ్మకాలు అంతంతే..!
ధన త్రయోదశికి చిన్నమెత్తు బంగారం కొనాలనేది భారతీయుల సెంటిమెంట్. ప్రతి ఏటా ఎంతో కొంత బంగారం కొందామని ఆసక్తి కనబరిచే ప్రజలు ఈసారి కరోనా మహమ్మారి కారణంగా వెనుకంజ వేయటంతో ఆభరణాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. కరోనా కష్టాలకు తోడు బంగారం వెండి ధరలు పెరగటంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగాయి. గత ధన త్రయోదశితో పోల్చితే ఈసారి అమ్మకాల్లో 30 శాతం వరకూ తగ్గుదల నమోదైందని వ్యాపారులు అంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి