ETV Bharat / city

వైద్యుల హెచ్చరిక: పొగాకు వాడే వారికి రోగనిరోధక శక్తి తగ్గుతుంది! - ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం 2021

పొగాకు క్యాన్సర్‌కు కారకం... ఇది ఎన్నిసార్లు విన్నా వాటిని సేవించేవారు మాత్రం మత్తు వదలడంలేదు. పొగాకు వినియోగించే వారిలో రోగనిరోధక శక్తి తగ్గి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటికి బానిసలుగా మారిన వారికి కొవిడ్‌ తగ్గిన తర్వాత బ్లాక్‌ఫంగస్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు వివరించారు. పొగాకు నిర్మూలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)... ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పాటిస్తోంది.

Tobacco Day
Tobacco Day
author img

By

Published : May 31, 2021, 9:46 AM IST

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం

ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. ఇది ప్రతి ఆరున్నర సెకన్లకు ఒకరిని బలితీసుకుంటోంది. మన దేశంలో ఏటా 10 లక్షల మంది పొగాకు వాడకం వల్ల చనిపోతున్నారు. ప్రతి వంద క్యాన్సర్ కేసుల్లో 35 పొగాకు ఉపయోగించడం వల్ల వచ్చినవే ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది "క్విట్ టొబాకో టు బి విన్నర్... పొగాకును వదిలేసి విజేతగా నిలవాలి".. అనే థీమ్‌ను డబ్ల్యూహెచ్​వో ప్రకటించింది. అలాగే కమిట్ టు క్విట్ అనే నినాదాన్ని ఇచ్చింది. దీని ప్రకారం మళ్లీ ఎప్పుడూ పొగాకును తాగనంటూ ప్రతిజ్ఞ చేయాలని సూచించింది.

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో గతేడాది లాక్‌డౌన్‌ నుంచి గంజాయికి బానిసలై ఆస్పత్రులకు వచ్చే యువకుల సంఖ్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. గంజాయితో పాటు సిగరెట్‌, మద్యం సేవించడం, గుట్కా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు. వీటి వల్ల రక్తంలో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుందని... దాని ప్రభావంతో హుషారుగా ఉండి అలసిపోతారని చెబుతున్నారు.

మత్తుపదార్థాలు సేవించే అలవాటు ఉన్న వారికి రోగనిరోధక శక్తి త్వరగా క్షీణించి కరోనా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ రెండో దశలో యువత అధికంగా కరోనా బారిన పడటానికి కారణం రోగనిరోధక శక్తి తగ్గడమేనని చెబుతున్నారు. మత్తుపదార్ధాలు సేవించడం వల్ల నోరు అపరిశుభ్రంగా మారి నోటి క్యాన్సర్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. పొగాకులో నికోటిన్‌తోపాటు దాదాపు 7వేల రకాలు ఉంటాయని ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయంటున్నారు. పొగాకు ఉత్పత్తుల వల్ల డీఎన్ఏ ప్రభావితమై... శరీర కణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి క్యాన్సర్‌గా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

డీ-అడిక్షన్ నిపుణులను సంప్రదించడం ద్వారా పొగాకుకు బానిసలైన వారికి చికిత్స అందించి సాధారణ స్థితికి చేర్చవచ్చని చెబుతున్నారు. అధునాతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినా అవగాహన లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

ప్రాణాల్ని పీల్చేస్తున్న పొగాకు వ్యసనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.