- అధికారం ఉందని దౌర్జన్యాలు చేస్తే... ప్రజలు పరుగులు పెట్టిస్తారు.. జాగ్రత్త: పవన్ కల్యాణ్
PAWAN: అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే.. ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హచ్చరించారు. అలాంటి ఉద్యమం వచ్చిన రోజున.. పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
- అమర్నాథ్ యాత్రలో నలుగురు రాష్ట్ర వాసులు గల్లంతు.. విజయనగరం వాసి క్షేమం
AMARANATH: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన రాష్ట్ర వాసులు కొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు యాత్రికులు కాగా అందులో విజయనగరం వాసి క్షేమంగా ఉన్నారు. అమర్నాథ్ యాత్రికుల వివరాల కోసం ఇప్పటికే ఏపీభవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
- Heavy rains in Telangana: వదలని భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
Heavy rains in telangana: అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేడూ, రేపూ భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- బాప్రే.. ఈ పొటేళ్ల ధర తెలిస్తే షాక్..!
EXPENSIVE RAMS: పొటేలు ధర ఎంతుంటుంది. బాగా ఎక్కువ అనుకుంటే రూ.30 వేలు. కానీ బాపట్ల జిల్లాలో ఓ యువకుడు పెంచే పొటేళ్లు మాత్రం.. లక్ష రూపాయలకు పైగానే ధర పలుకుతున్నాయి. మంచి బ్రీడ్ కావాలనుకునే వారితో పాటు.. బక్రీద్ సందర్భంగా ఖుర్భానీ కోసం ఎక్కువ మంది ఇక్కడ పొటేళ్లు కొనుగోలు చేస్తున్నారు.
- క్షమించండి.. ఇలా అయినందుకు సిగ్గు పడుతున్నా: సీఎం
ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త వినీత్ బగారియా కుటుంబాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పరామర్శించారు. వినీత్‌ను కాపాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. వినీత్ రెండు రోజుల క్రితం మాఫియా నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైనందునే ఈ దారుణం జరిగిందని అన్నారు హిమంత బిశ్వ శర్మ.
- నాలుగో అంతస్తు నుంచి దూకిన దొంగ.. దురదృష్టంకొద్దీ...
మహారాష్ట్ర ముంబయిలో ఓ దొంగ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకాడు. వాచ్‌మన్ చూశాడన్న భయంతో నాలుగో అంతస్తుకు ఎక్కిన దొంగ.. మూడు గంటలకు పైగా భవనంపైనే ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. దొంగను కాపాడేందుకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది విఫలయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వల పక్కకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- బార్లో భీకర దాడి.. బస్‌లో వచ్చి బులెట్ల వర్షం.. 14 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని ఓ బార్లో కాల్పులు జరగ్గా 14 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. జొహెన్నస్బర్గ్లోని సెవేటో టౌన్షిప్లో ఈ ఘోరం జరిగింది. కొందరు దుండగులు మినీ బస్‌లో వచ్చి, బార్లోకి చొరబడి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. శక్తిమంతమైన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
- స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Price Today: బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- అఫ్రిది.. ఏంటీ మార్పు.. నువ్వేనా ఇలా చేసింది?
Shahid Afridi praises teamindia: ఎప్పుడూ భారత్ క్రికెట్‌పై విమర్శలు చేసే పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఈ సారి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. టీమ్ఇండియాపై ప్రశంసలు కురిపించాడు.
- రణ్‌బీర్ స్పెషల్ సర్ప్రైజ్.. ఒక్కసారిగా ఆలియా ఏం చేసిందంటే?
Ranbir kapoor surprises Aliabhatt: తన భార్య, హీరయిన్ ఆలియాభట్‌ను హీరో రణ్‌బీర్ కపూర్ సర్ప్రైజ్ చేశారు. దీంతో ఆలియా.. ఒక్కసారిగా ఆయన్ను హత్తుకుని ఆనందానికి లోనయ్యారు.