- రెండు దేశాలు సంయమనం పాటించాలి
భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటన, పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు
భారత్- చైనా మధ్య మే మొదటివారంలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మేజర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిశితంగా పరిశీలిస్తున్నాం
భారత్-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది అగ్రరాజ్యం అమెరికా. లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన జవాన్లకు సంతాపం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనా వ్యూహాలివే
ధవళ వర్ణంలో మెరిసిపోయే హిమాలయాలకు చైనా నెత్తుటి మరకలు అద్దుతోంది. భారత సరిహద్దులోని కీలకమైన భూభాగాలను ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుంగదీస్తున్న రెవెన్యూ లోటు
రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లలో అంచనాలు తలకిందులవుతున్నాయి. రెవెన్యూ లోటు కుంగదీస్తోంది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవటం, వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో రెవెన్యూ శాఖకు సవాలు ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అయ్యన్నపై నిర్భయ కేసు
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. తనను దూషించారన్న నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైకాపాలో ఎంపీ కలకలం
ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహార సరళిపై మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వద్ద వారు విలేకర్లతో మాట్లాడారు. ఆయనకు అంత సీన్ లేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ వస్తువులు సురక్షితమేనా?
అవసరమైన వస్తువులను సెకండ్ హ్యాండ్లో కొందాం అంటే.. అమ్మే వ్యక్తి ద్వారా కరోనా సోకుతుందేమోననే భయాలు వెంటాడుతున్నాయి. అయితే సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇలాంటి సమయంలో కొనడం మంచిదేనా? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
- ధోనీపై ఎప్పుడూ ఆధారపడలేదు
మహేంద్ర సింగ్ ధోనీ మీద తాను ఆధారపడ్డానంటూ వస్తోన్న వార్తలను ఖండించాడు టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. తానెప్పుడూ మహీపై ఆధారపడలేదని స్పష్టం చేశాడు. ధోనీ మార్గనిర్దేశం మాత్రమే చేశాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెంగ్విన్ తొలిపాట విన్నారా!
హీరోయన్ కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో నటించిన 'పెంగ్విన్' చిత్రం.. ఆన్లైన్ వేదికగా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను సోషల్మీడియాలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.