- రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో.. అనధికార కర్ఫ్యూ, లాక్డౌన్!
కరోనా రెండోదశ ప్రళయంగా మారిపోతున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికి వారే కట్టడి చేస్తున్నారు. తీవ్రత అధికంగా ఉన్నచోట్ల వ్యాపార సంఘాలు చర్చించుకుని పనివేళలు కుదించుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల అధికార యంత్రాంగం, స్థానిక సంస్థలు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాల్ని మూసేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా 22% పెంపు
రాష్ట్రాలకు సగటున 8% ఆక్సిజన్ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వామికి గులకరాళ్లతో నైవేద్యం.. గ్రామస్థుల వింత ఆచారం!
గులకరాళ్లతో ఏం చేయొచ్చు..? పిల్లలైతే ఆడుకుంటారు. కాంట్రాక్టర్లైతే రోడ్లు వేస్తారు.! అవే రాళ్లను అక్కడి ప్రజలు దేవుడికి నైవేద్యంగా వేస్తున్నారు.! వినడానికి విడ్డూరంగా ఉందా..? అక్కడికెళ్లి చూస్తే కాస్త వింతగానూ ఉంటుంది. కానీ ఆ రాళ్ల వెనక ఓ పల్లె ప్రజల భక్తివిశ్వాసం దాగి ఉంది. ఈ వింతైన ఆచారం గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- అమవరావతి అభివృద్ధి పనులు.. ఏఎమ్ఆర్డీఏ నుంచి బదలాయింపు
అమవరావతి అభివృద్ధి పనులను ప్రభుత్వం ఏఎమ్ఆర్డీఏ నుంచి అమరావతి స్మార్ట్, సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పనులకు 360 కోట్ల రూపాయలను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాతో సీతారాం ఏచూరి తనయుడు మృతి
సీపీఎమ్ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తనయుడు అశిష్ ఏచూరి కొవిడ్ కారణంగా మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాల్ దంగల్: ఆరో విడత పోలింగ్ షురూ
బంగాల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. జగత్దల్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- ఐటీ ఉద్యోగులకు టీకా- ఇంకొన్నాళ్లు ఇంటి నుంచే పని!
మరికొన్నాళ్లు ఇంటి నుంచే పని తప్పనిసరైన నేపథ్యంలో తమ ఉద్యోగులకు కరోనా టీకాలు అందించే యోచనలో ఉన్నాయి ఐటీ కంపెనీలు. అందుకు అనుగుణంగా పలు సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. డిసెంబరు నాటికి 70 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చే అవకాశం ఉందనే వార్తల నడుమ టీకా తప్పనిసరని భావిస్తున్నట్లు హైసియా ప్రెసిడెంట్ భరణి కె అరోల్ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అణు'మానాలు ఎన్నిఉన్నా అత్యంత సంయమనం
భారత్, చైనా అత్యంత సంయమనంతో ఉంటాయని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ(సిప్రి) పేర్కొంది. తమకు తాముగా ఏ దేశం మీదా అణు దాడి చేయకూడదన్నది భారత్, చైనాల ప్రకటిత విధానమని తెలిపాయి. భారత్, చైనా, అమెరికా, రష్యా, పాకిస్థాన్‌లకు చెందిన 119 మంది నిపుణులను ఇంటర్వ్యూ చేసిన మీదట సిప్రి ఈ నిర్ధరణకు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాక్సింగ్‌లో భారత్ జోరు.. ఫైనల్స్‌కు ఎనిమిది మంది
ప్రపంచ యువ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఎనిమిది మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్‌లో సత్తాచాటి ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలే కావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓటీటీలోకి వచ్చిన నాగార్జున 'వైల్డ్‌డాగ్'
మరో కొత్త సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్‌డాగ్'.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.