ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - టాప్ న్యూస్

టాప్ టెన్ న్యూస్

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Feb 12, 2021, 8:59 AM IST

  • రేపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. ఎన్ని స్థానాల్లో అంటే!

రేపటి రెండో దఫా పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. 13 జిల్లాల్లోని 167 మండలాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచారపర్వం ముగియగా, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక నాలుగో విడత నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎన్నికల్లో కలగజేసుకోవాలని రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ

రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాలకు తెదేపా అధినేత చంద్రాబాబు లేఖలు రాశారు. వైకపా చేస్తున్న ఆరాచకాలపై ఎస్ఈసీకి, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఉన్నతాధికారులు, కంపెనీ బలగాలతో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖ ఉక్కుపై ఒడిశా పెత్తనం.. అఖిలపక్ష భేటీలో నేతలు

ఒడిశా నాయకులు, అధికారులపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై వారి పెత్తనం సాగుతోందని ఆరోపించారు. రాయ్‌బరేలీలో రైలు చక్రాల కర్మాగారం నిర్మాణానికి ఉక్కు కర్మాగారానికి చెందిన రూ.2 వేల కోట్లు తరలించారని అన్నారు. కీలక స్థానాల్లో ఉండి స్థానిక హక్కులను కాలరాస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శాసన రాజధాని భవనాల కోసం కమిటీ

అమరావతిలో శాసన రాజధానికి కావాల్సిన భవనాలేవో తేల్చేందుకు.. ప్రభుత్వం కమిటీను ఏర్పాటు చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ.. అమరావతిలో నిర్మాణం పూర్తైన, అసంపూర్తిగా నిలిచిన భవనాలను పరిశీలించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 20శాతం భారత భూగర్భజలాల్లో ప్రమాదకర 'ఆర్సెనిక్' ‌

దేశంలోని 20శాతం భూగర్భజలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్​ ఉన్నట్లు ఐఐటీ ఖరగ్​పుర్ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 25కోట్ల మంది ఈ ఆర్సెనిక్​ నీటిని వాడుతున్నట్లు తెలిపింది. ఆర్సెనిక్‌ ఎక్కువగా గమనించిన ప్రాంతాలు సింధు-గంగా- బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్నాయని నిపుణులు తెలిపారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా టీకా మార్గదర్శకాలపై విచారణకు సుప్రీం నో

కరోనా టీకా పంపిణీ కొనసాగుతోన్నవేళ నకిలీ టీకాలు సరఫరా అయ్యే ప్రమాదం ఉందనే వ్యాజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో టీకా మార్గదర్శకాలపై విచారణ సముచితం కాదని అభిప్రాయపపడింది. అయితే బలమైన ఆధారాలతో కోర్టు దృష్టికి తీసుకువస్తే విచారణకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెట్రో బాదుడు.. వరుసగా నాలుగోరోజు పెరిగిన ధరలు

దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా నాలుగోరోజు పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు పెరిగింది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 94.64కి చేరింది. డీజిల్​ ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హెచ్​-1బీ వీసాలపై శ్వేతసౌధం కీలక ప్రకటన

హెచ్​-1బీ వీసాల జారీపై కీలక ప్రకటన చేసింది అమెరికా. ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థలో సరళమైన విధానాల పునరుద్ధరణపై అధ్యక్షుడు జో బైడెన్​ చాలా స్పష్టంగా ఉన్నారని తెలిపింది. విభజనపూరితంగా, అమానవీయంగా తీసుకున్న విధానాలను మార్చటంపైనే దృష్టిసారించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలిటెస్టులో భారత్ ఓటమి..​ క్యూరేటర్ తొలగింపు!

చెపాక్​లోని పిచ్​ క్యూరేటర్​కు ఉద్వాసన పలికింది బీసీసీఐ. తొలి టెస్టులో ఇంగ్లాండ్​ భారత్​ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రెండో టెస్టు, శనివారం(ఫిబ్రవరి 13) నుంచి చెన్నైలో జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్​లో ఆమిర్​ఖాన్!

చెస్ దిగ్గజం ఆనంద్ బయోపిక్​లో ఆమిర్​ఖాన్ నటించే అవకాశముంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత మహావీర్ జైన్ వ్యాఖ్యలే ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. ఇందులో నిజమెంత? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.