- పోలింగ్ ప్రారంభం
రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎంకు చంద్రబాబు లేఖ
సీఎం జగన్ కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నంబర్ 3ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల పోస్టులు వారికే దక్కేలా చూడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎక్స్‌ప్రెస్‌లుగా ప్యాసింజర్ రైళ్లు?
ప్యాసింజర్ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్నాయి. ప్రయాణదూరం 200కిమీ, ఆపై ఉన్న రైళ్లను గుర్తించి ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చనున్నారు. ఈ మేరకు రైల్వేబోర్డు కసరత్తు ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తనలో నన్ను చూసుకోండి
చైనా సరిహద్దు ఘర్షణలో అసువులు బాసిన కర్నల్ సంతోష్‌బాబు మరణం వేలాది ఎదలను కదిలించింది. ఆ యుద్ధ వీరుడి శరీరం మంటల్లో కలిసిపోతున్న చివరి క్షణాల్లో తన మనసులో అనుకున్న మాటలివి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- పెరుగుతున్న కరోనా బాధితులు
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,586 కేసులు నమోదయ్యాయి. మరో 336 మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏడుగురు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి భద్రతా దళాలు. పుల్వామా, షోపియాన్లలో వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం ఏడుగురిని మట్టుబెట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనాపై అమెరికా ఫైర్
చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులకు అమెరికా సంతాపం తెలిపింది. సైనికుల మృతిపై భారత ప్రజలకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ ఆర్థిక పవనాలు, భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 34,275 వద్ద ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మనది అత్యుత్తమ పేస్ దళం
ప్రస్తుతం భారత జట్టులో ఉత్తమమైన పేసర్లు ఉన్నారని తెలిపాడు టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమీ. జట్టులో ఎవ్వరికీ అసూయ లేదని, ఒకరి విజయాన్ని ఒకరు ఆస్వాదిస్తారని స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కీర్తి సురేశ్ 'పెంగ్విన్' ఆకట్టుకుందా!
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పెంగ్విన్'. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల నేరుగా ఓటీటీలో విడుదల చేశారు నిర్మాతలు. మరి సినిమా ఎలా ఉందంటే..