ETV Bharat / city

ప్రధాన వార్తలు @11AM

టాప్ టెన్ న్యూస్

author img

By

Published : May 4, 2021, 11:01 AM IST

top news
టాప్ టెన్ న్యూస్
  • దేశవ్యాప్తంగా 2కోట్లు దాటిన కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్​ను​ దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల‬ మంది వైరస్​ బారినపడ్డారు. వైరస్ ​బారినపడిన వారిలో మరో 3,449 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాబడి అంచనాల్లో రూ.50 వేల కోట్లు హుష్‌

కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 50 వేల కోట్ల మేర రాబడి తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకుంటే మరో పోరాటం తప్పదు:లోకేశ్

ఏపీపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకుంటే మరో పోరాటం తప్పదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. గతేడాది ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆయన... ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మూడేళ్లకే 'స్ప్రింగ్​ గర్ల్​ ఆఫ్​ నయాగరా' ఘనత!

రబ్బరు బొమ్మలాగా ఒంటిని భలే వంచేస్తోందే..! ఈ చిన్నారి చేసే స్టంట్లు చూస్తే ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే. తలను సునాయాసంగా వంచి, కాలి వేళ్లను ముద్దాడగలదు. రెండు కాళ్లనూ, చేతులనూ పూర్తిగా మడతపెట్టి కూర్చోగలదు. కఠినతరమైన యోగాసనాలను కూడా అలవోకగా చేసేయగలదు. స్ప్రింగ్‌ లాగా ఒళ్లంతా వంచేయగలదు. ఈ ప్రత్యేకతల వల్లే స్ప్రింగ్ గర్ల్ ఆఫ్ నయాగరా అన్న బిరుదు సంపాదించేసుకుందీ బుడత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మంత్రే అంబులెన్సు డ్రైవర్​గా మారి..

ఒడిశా మంత్రి సుశాంత​ సింగ్.. తానే స్వయంగా అంబులెన్సు నడిపి ఓ కొవిడ్​ బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్​​ 90 డౌన్​

స్టాక్ మార్కెట్లు సెషన్​ ప్రారంభమైన కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 90 పాయింట్లకుపైగా కోల్పోయి 48,627 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా తగ్గి 14,599 వద్ద కొనసాగుతోంది. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • బ్రిటన్​లో సీరం సంస్థ భారీ పెట్టుబడులు

బ్రిటన్​లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్​కు చెందిన బడా వ్యాపార సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే.. పుణెకు చెందిన దిగ్గజ ఔషధ తయారీ సంస్థ సీరం​ కూడా బ్రిటన్​లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచింది. 240 మిలియన్ల బ్రిటిష్ పౌండ్లు వెచ్చించి పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సన్​రైజర్స్​ వైఫల్యానికి స్వయంకృతాపరాధమే కారణమా?

గత ఐపీఎల్​ సీజన్లలో కనీసం ప్లే ఆఫ్​ చేరిన సన్​రైజర్స్​.. ఈసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దానికి కారణం స్వయంకృతాపరాధమే. గెలవాల్సిన నాలుగు మ్యాచ్​లు ఓడిపోవడమే కాకుండా మిడిలార్డర్​ ఘోరంగా విఫలమైంది. దీంతో ఈ సారి ప్లే ఆఫ్​ అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టాలీవుడ్ దర్శకులు.. వారి డ్రీమ్ ప్రాజెక్టులు!

ప్రతి డైరెక్టర్​కు తన కలల ప్రాజెక్టు తెరకెక్కించాలని ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.