ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - ఏపీ వార్తలు

టాప్ టెన్ న్యూస్

11 am top news
టాప్ న్యూస్
author img

By

Published : Feb 17, 2021, 11:00 AM IST

  • ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల వివిధ కారణాలతో ఓటింగ్ నిలిచిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సరికాదు.. బీఎంఎస్‌ ఘాటు లేఖ

ప్రతిష్ఠాత్మకమైన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ- ‘భారతీయ మజ్దూర్‌ సంఘ్‌’ (బీఎంఎస్‌) గట్టిగా వ్యతిరేకించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాసింది. విశాఖ ఉక్కు సహా ఇతరత్రా పీఎస్‌యూల ప్రైవేటీకరణ సరికాదని ఆ లేఖలో విస్పష్టంగా పేర్కొంది. లేఖ ప్రతిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఔషధాల్లో ఎన్నివందల శాతం దోచేస్తున్నారో తెలుసా?

షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ పర్యవేక్షణ కొనసాగుతోంది. వీటిపై ఎమ్మార్పీ ఎంతుండాలనేది ఆ సంస్థే నిర్ణయిస్తోంది. నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలను మాత్రం నియంత్రించడం లేదు. ఔషధ వ్యాపారంలో పెద్దఎత్తున దోపిడీకి ఇక్కడే బీజం పడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎత్తేసిన కోర్సులో సీట్లిచ్చారు!

ప్రవేశపరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌లో ఎంపిక చేసుకున్న కళాశాలలో సీట్లను కేటాయించారు. తీరా మంగళవారం కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడానికి వచ్చినవారికి ఆ కోర్సును రెండేళ్ల క్రితమే ఎత్తివేశారని తెలియడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాతావరణ మార్పుపై భారత్​-బ్రిటన్​ చర్చ

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం(సీఓపీ) అధ్యక్షుడిగా ఎంపికైన బ్రిటన్​ ఎంపీ అలోక్​ శర్మ.. భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​, పర్యావరణ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​తో సమావేశమయ్యారు. నవంబర్​లో.. బ్రిటన్​లో జరగబోయే సీఓపీ 26వ సమావేశంలో ఇరుదేశాలు పోషించే పాత్రపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రజల కోసమే పని చేశా: కిరణ్​ బేడీ

తనను పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్​ పదవి నుంచి తొలగించటంపై స్పందించారు కిరణ్​బేడీ. లెఫ్టినెంట్‌ గవర్నర్​గా అవకాశమిచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ పదవితో.. తాను జీవితకాల అనుభూతి పొందానన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్యాంకుల ప్రైవేటీకరణకు రెండు చట్టాల్లో సవరణలు

బడ్జెట్​లో ప్రకటించినట్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు.. కేంద్రం అవసరమైన చట్ట సవరణలు చేయనుంది. రెండు చట్టాలకు సంబంధించిన సవరణలకు వర్షాకాల సమావేశాల్లో గానీ, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆమోదం లభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెట్​ స్టోర్​లో అగ్నిప్రమాదం-100 జంతువులు మృతి

అమెరికాలోని ఇండియానాపొలిస్​ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఓ పెంపుడు జంతువుల కేంద్రంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 100 మూగజీవాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది కొన్ని జంతువులు, పక్షులను రక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అంపైర్​తో గొడవ.. కోహ్లీపై ఓ మ్యాచ్​ నిషేధం!

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో అంపైర్​తో గొడవ పెట్టుకున్న కారణంగా టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై వేటు పడనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం కోహ్లీకి.. నాలుగు డీ-మెరిట్​ పాయింట్లు ఇవ్వడం సహా అతడిపై ఓ టెస్టులో నిషేధం విధించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈ స్టార్స్​కు భారతీయ పౌరసత్వం లేదా?

తమ నటనతో అలరించిన పలువురు బాలీవుడ్ హీరోహీరోయిన్లకు భారతీయ పౌరసత్వం లేదు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరసత్వం లేని ఆ నటులు ఎవరు? వారు ఏ దేశానికి చెందిన వారు? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.