- పక్కా ఆధారాలతోనే...
తెదేపా హయాంలో మందుల కొనుగోలులో ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధరణ అయిందని అనిశా అధికారులు వెల్లడించారు. ఫేక్ ఇన్వాయిస్‌తో మందులు కొనుగోలు చేశారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చెప్పినా వినలేదు
ఏలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడి భార్య విజయ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు, లోకేశ్... పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేతల మండిపాటు
అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను పలువురు నేతలు ఖండించారు. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తున్నారనే కారణంగానే అరెస్టు చేశారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళపై వైకాపా నేత దాడి
కడప జిల్లాలో వైకాపా నేత మహబూబ్ బాషా రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళపై దాడి చేశాడు. తనకు ఎదురుగా వచ్చిందన్న కారణంతో విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగి కింద పడేశాడు. స్థానికులు అడ్డుకున్నా వినలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చర్యలు తీసుకోవద్దు
లాక్డౌన్ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సూచించింది సుప్రీం కోర్టు. పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత పౌరుడు మృతి
భారత పౌరులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదుపులోకి రాని మంటలు...
అసోం టిన్సుకియా జిల్లాలోని చమురు బావిలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉన్నందున సుమారు 7 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డాలర్ కలలకు బ్రేకులు
హెచ్-1 బీ వీసా సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేసే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం పెరుగుదల సమస్యలతో అమెరికా సతమతమవుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో ఎనిమిదో వ్యక్తికి కరోనా
ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా ఇంట్లో ఎనిమిదో వ్యక్తి తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆయన ఇంట్లోని మిగతా సభ్యులు, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఫాతిమా మహల్' కోసం అమితాబ్, ఆయుష్మాన్
అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గులాబో సితాబో' ఎలా ఉంది? అమితాబ్, ఆయుష్మాన్ కలిసి ఎంతవరకు అలరించారు? తదితర విశేషాల కోసం ఈ రివ్యూ చదివేయండి.