కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు కోసం చేసుకున్న ఒప్పందాలు, ధరల చెల్లింపు, ఒప్పంద కాలావధి తదితర అంశాలను ఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సౌర విద్యుత్ పవర్ ప్రాజెక్టుల ఒప్పందాల్లో భాగంగా... ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన విద్యుత్, ఎప్పటినుంచి కొనుగోళ్లు నిలిపివేశారన్న వివరాలను నమోదు చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్న అంశాలపై సమావేశంలో చర్చించారు. 10 వేల మెగావాట్ల సామర్ధ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన వనరులు, సమగ్ర రూపకల్పన తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండీ... రాజధానిగా అమరావతే ఉండాలి:డి.రాజా