ETV Bharat / city

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

author img

By

Published : Sep 3, 2020, 11:12 AM IST

Updated : Sep 4, 2020, 5:55 AM IST

suprim court
సుప్రీంకోర్టు

11:09 September 03

ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వ అభ్యర్థన తిరస్కరణ

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని, స్టే పై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం స్టే ఇవ్వబోమని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియరు న్యాయవాది విశ్వనాథన్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పురోగామి, అభ్యుదయ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం కోసమే ప్రభుత్వ పాఠశాలలను వీడుతున్నారు. ఆంగ్ల మాధ్యమంవల్లే నేను మీ ముందు మాట్లాడగలుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం సమంజసం కాదని, ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు.

విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 29(2) ప్రకారం ‘సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే విద్యా బోధన’ అనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లుగా ఉంది. - జస్టిస్‌ చంద్రచూడ్‌

ఐచ్ఛికం ఇవ్వలేదనే ప్రశ్నిస్తున్నాం
విద్యార్థులకు ఐచ్ఛికం ఇవ్వకపోవడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని ప్రతివాదుల తరఫు సీనియరు న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు మాధ్యమ పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమంలోకి మారతాయని, మాతృభాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ నిర్ణయంవల్ల తమ పిల్లలను తెలుగు మాధ్యమ పాఠశాలలకు పంపాలనుకునే తల్లిదండ్రులు ఆ అవకాశం కోల్పోతారు. మైనారిటీ, ప్రైవేటు పాఠశాలలే తెలుగు మాధ్యమంలో నేర్పించగలవు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలోనే బోధిస్తారు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ దశలో ధర్మాసనం స్పందిస్తూ.. కౌంటరు దాఖలు చేయాలని, స్టే ఇవ్వబోమని పేర్కొంది. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిస్తారని, ఆ అంశాన్ని తొలగించడం లేదని విశ్వనాథన్‌ తెలిపారు. హైకోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వకపోతే రాష్ట్రంలో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఆయన అనడంతో ఏం నష్టం జరుగుతుందని గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక తరం పూర్తిగా నష్టపోతుందని, మీరు (శంకర్‌ నారాయణ్‌) మాట్లాడినంత సులభంగా ఆంగ్లంలో మాట్లాడలేరని విశ్వనాథన్‌ పేర్కొన్నారు. అనంతరం కేసులో కేవియట్‌ దాఖలు చేసిన ప్రతివాదులు కౌంటరు దాఖలు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. స్టే అంశంపై తదుపరి విచారణలో నిర్ణయిస్తామని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా దాడులు

Last Updated : Sep 4, 2020, 5:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.